
ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో కలసి “శ్శంభ్ 29” అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కెన్యాలోని అద్భుతమైన లొకేషన్లలో ప్రారంభమైంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. అలాగే మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను సెలెక్ట్ చేసినట్లు కూడా ఫిల్మ్ నగర్ టాక్ చెబుతోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇంత పెద్ద సినిమాలు తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన కెరీర్‌లో ఒక ప్రత్యేక కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోయారని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ కోరిక ఏమిటంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేయాలని ఆయన చాలా కాలం నుంచి ఆశపడుతున్నారని సమాచారం.
ఈ విషయాన్ని కూడా రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా వెల్లడించారు. నిజానికి “బాహుబలి” సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సూర్యను సంప్రదించారట. కానీ ఆ సమయంలో సూర్య ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారు. తరువాత “ఋఋఋ” సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం సూర్యను అనుకున్నారట. కానీ అప్పుడు ఆయన మరొక ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటంతో, షెడ్యూల్ అడ్జస్ట్ కాలేదని టాక్. అప్పటినుంచి రాజమౌళి మనసులో “సూర్యతో తప్పనిసరిగా ఓ సినిమా చేయాలి” అనే కోరిక మిగిలిపోయింది. ఆ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందా లేదా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్‌గా మారిపోయింది.
ఇక సూర్య విషయానికి వస్తే, ఆయన కెరీర్‌లో ఇటీవల వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కంగువా, రెట్రో రెండు సినిమాలు కూడా అభిమానులను నిరాశపరిచాయి. ప్రస్తుతం సూర్య దర్శకుడు వెంకీ ఆట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయితే సూర్య మళ్లీ తన కెరీర్‌లో బలమైన స్థానం సంపాదించుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే, “జక్కన్న-సూర్య కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే అది ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది” అని భావిస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్లూ ఆ డ్రీమ్ కాంబినేషన్ ఎప్పుడు రియాలిటీ అవుతుందా అన్న దానిపైనే ఉన్నాయి.