
ఒకసారి ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు దీనిపై తన మనసులోని మాటను వెల్లడించారు. ఇంటర్వ్యూవర్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, "నేను ఏ వ్యక్తినైనా చూసినప్పుడు మొదట గమనించేది వారి స్మైల్. చిరునవ్వు మనిషి మనసుని ప్రతిబింబిస్తుంది. ఎవరి దగ్గరైనా స్మైల్ చూడగానే మనసు హాయిగా మారిపోతుంది. అందుకే స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్" అని ఆయన చెప్పిన మాటలు చాలామందికి బాగా కనెక్ట్ అయ్యాయి. నిజంగానే మనం ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్‌లో, పరుగు పరుగు జీవితంలో నవ్వడం మానేస్తున్నాం. ఆనందానికి సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు మహేష్ చెప్పిన ఈ మాటలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. కనీసం మనకి మనం టైం కేటాయించుకుని నవ్వుకోవడం నేర్చుకోవాలి. లేదంటే ఎదుటి వాళ్ల జీవితంలోనైనా ఒక చిరునవ్వును చూసి మనసు ప్రశాంతంగా చేసుకోవాలని ఆయన ఇచ్చిన ఈ సలహా చాలా పాజిటివ్‌గా మారింది.
ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, ప్రత్యేకంగా కెనియాలో ప్రధాన షెడ్యూల్ జరుగుతోందని సమాచారం. అయితే తాజాగా ఈ షూటింగ్‌కు అనుకోకుండా బ్రేక్ పడింది. దానికి కారణంగా మీడియాలో వైరల్ అవుతున్న ఓ న్యూస్ ప్రకారం, మహేష్ బాబు కొడుకు గౌతమ్ చదువుతున్న కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ సంఘటన వల్ల గౌతమ్ మానసికంగా కాస్తా బాధపడటంతో, మహేష్ అమెరికా వెళ్లి కొడుకుతో సమయం గడుపుతూ, అతన్ని ఓదారుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.