
ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆ సినిమా కాస్ట్యూమ్ లోనే ఈవెంట్ కి రావడంతో అందరూ షాక్ గురయ్యారు. OG చిత్రంలో ఉపయోగించిన కటానా తీసుకువచ్చి మరి విన్యాసాలు చేశారు పవన్ కళ్యాణ్. స్టైలిష్ కళ్ళజోడు పెట్టుకుని మరి స్టేజ్ పైన శివమణి డ్రమ్స్ బీట్ కి ఊగిపోయారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయడంతో చూసి అభిమానులు సైతం మేము పిచ్చ హ్యాపీ తో ఉన్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ నేనా అనే సందేహం వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఎప్పుడు కూడా సింపుల్గానే మాట్లాడి వెళ్లిపోయేవారు కానీ ఇప్పుడు వాటన్నిటిని వ్యతిరేకిస్తూ ఫుల్ జోష్ అభిమానులకు నింపేలా చేశారు పవన్ కళ్యాణ్. దీనంతటికి ముఖ్య కారణం డైరెక్టర్ సుజిత్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడుతూ డైరెక్టర్ సుజిత్ వల్లే తాను ఈవెంట్ కి ఇలాంటి కాస్ట్యూమ్ లో వచ్చాను అంటూ తెలిపారు. షూటింగ్ సమయంలో కూడా తాను డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మరిచిపోయి మరి తెగ ఎంజాయ్ చేశానని సుజిత్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా OG హుడి వేసుకొని దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. చూసిన పవన్ ఫ్యాన్స్ సుజిత్ మా పవన్ కళ్యాణ్ ని ఏం చేశావు బ్రో? ఇలా మారిపోయారు.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.