ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరు పొందిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సర్వసాధారణం . అయితే కొంతమంది హీరోలకు హీరోలే అభిమానులుగా ఉన్నామని ఎన్నో సందర్భాలలో చెప్పడం మనం చూసే ఉన్నాము.అలా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి  సినిమా ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలవ్వడంతో ఈ సినిమా వెళ్లడానికి  సెలబ్రిటీలతో పాటు,రాజకీయ నాయకులు కూడా తమ పనులను క్యాన్సిల్ చేసుకుని మరి వెళ్లారు. సినిమా టాక్ సూపర్ గా ఉండడంతో మరి కొంతమంది వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇలాంటి సందర్భంలోనే టాలీవుడ్ ఒక హీరో తన సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని మరి ఓజి సినిమా ఫస్ట్ రోజే చూడడానికి ఆతృతగా ఉన్నారు. ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు టాలీవుడ్ హీరో అయినా అశోక్ గల్లా. ఓజి సినిమాకి సంబంధించి ఫస్ట్ షో చూడాలని ఆశపడుతూ ఉండగా తన సినిమా షూటింగ్ కూడా ఆ రోజే ఉండడంతో ఆ షూటింగ్స్ క్యాన్సిల్ చేయాలని డైరెక్టర్ ని ఎలా బ్రతిమలాడుతున్నారో చూపిస్తూ ఫన్నీ వీడియోను షేర్ చేశారు హీరో అశోక్ గల్లా.


ఓజి సినిమా రిలీజ్ సమయంలో కూడా డైరెక్టర్ షూటింగ్ అని చెప్పడం, ఆ తర్వాత చిత్ర బృందం సినిమాకి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవడం వంటివి ఈ వీడియోలో చూపించారు. అయితే చివరికి ఓజి సినిమాకి హీరో వెళ్లారా? లేదా? అనేది మాత్రం వీడియోలో చూపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వీడియోని చూసి తెగ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ హీరో అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానినే  అంటూ చెప్పడంతో పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రస్తుతం అశోక్ గల్లా విరాట సరదాగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: