
ఇక మొదటి భాగంలో ఒక హీరోనే అయినప్పటికీ రెండవ భాగంలో ఇద్దరు హీరోలతో రూపొందిన సీక్వెల్స్ ఎన్నో ఉన్నాయి . ఈ తరుణంలోనే ఓజి కూడా నడవనుంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ కి కూడా సీక్వెల్ ఉండనుందని ఇప్పటికే మూవీ టీం ప్రత్యక్షంగా వెల్లడించింది . సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ తమన్ bgm తో హైలెట్గా నిలిచింది . సుజిత్ ఎలిమెంట్స్ కి తగ్గ తమన్ బిజిఎం ఉండడంతో బాక్స్ ఆఫీస్ లో షేక్ అవుతున్నాయి . భారీ మొత్తంలో కలెక్షన్స్ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు . ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు మూవీ టీం . ఈ నేపథ్యంలోనే ఓ ఈవెంట్లో పాల్గొన్న సుజిత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు .
ఓజీ 2 లో ప్రభాస్ కూడా ఉండనున్నాడని పరోక్షంగా వెల్లడించాడు . ఒకపక్క పవర్ స్టార్ మరో పక్క రెబెల్ స్టార్ కలిస్తే మూవీ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు . ఇదే కనుక రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్లో దబిడి దిబిడే అని చెప్పుకోవచ్చు . సుజిత్ మాట్లాడుతూ.." బేసిగ్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ . కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమా చేశాను . నాకు ఇద్దరు పైన చాలా రెస్పెక్ట్ ఉంది . వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తా . ఈ సినిమా హీరో రిలీజ్ అయింది కదా .. మరి కొద్ది రోజులకు ఆలోచిస్తాను . తరువాత ఓజీ 2 ఎలా చేద్దాము అనేది ఆలోచిస్తాము " అంటూ వెల్లడించాడు . ప్రజెంట్ సుజిత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .