టాలీవుడ్, కోలీవుడ్లో యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఒకరు. 2018లో మొదటిసారి నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయంయ్యింది. ఆ తర్వాత మెకానిక్ రాఖీ, డాకు మహారాజ్ తదితర చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె నటించిన మొదటి వెబ్ సిరిస్ "ది గేమ్ యూ నెవెర్ ప్లే అలోన్" అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నటించినది. ఈ సిరీస్ అక్టోబర్ రెండవ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్మింగ్ కాబోతోంది.



ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమాల ఎంపికలు విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాను కొద్ది రోజుల నుంచి ఎక్కువ పద్ధతి గల పాత్రలు నటించడానికి ప్రేక్షకులే కారణం, తనని అలా చూడాలని కోరుకోవడం వల్లే.. ఇక నుంచి తాను లవ్, రొమాన్స్ తో పాటు, సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాలలో కూడా నటించాలని ఇష్టపడుతున్నానని ఇక నుంచి తాను కూడా పద్ధతి గల పాత్రలను చేయాలనుకోవడం లేదంటూ తెలియజేసింది.

అందరూ కూడా ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని అడుగుతున్నారు ! అది నా లక్ష్యం కాదు చేసింది తక్కువ చిత్రాలే అయినా కూడా అందులో తన పాత్రకు మంచి పేరు రావాలని అభిమానులను అలరించేలా ఉండడమే నా లక్ష్యం అందుకే ఇప్పటినుంచి ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో చాలా జాగ్రత్త పాటిస్తానంటూ తెలియజేసింది. ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించిన తరువాతే విభిన్నమైన కథలు పాత్రలు ఉంటేనే సినిమాలను ఎంచుకుంటానంటూ తెలియజేసింది. శ్రద్ధా శ్రీనాథ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బ్రో కోడ్, ఆర్యన్ అనే తమిళ చిత్రాల నటిస్తోంది. ఈ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. తెలుగులో చివరిగా కలియుగం 2064 చిత్రంలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: