
ఇక జగన్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు పేరుతో అమరావతి పక్కన పెట్టారు.. పోలవరానికి సంబంధించి కాపర్ డ్యాం కొట్టుకుపోవడం వ్యవహారం వంటివి జరగడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వీటిని పూర్తి చేసేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోనే పూర్తి చేయాలని చెప్పిన.. అంత తక్కువలో పూర్తి చేయలేమని అప్పటి సీఎం జగన్ చెప్పడం వంటివి చేయడంతో పోలవరం పనులు అలాగే ఆగిపోయాయి. ఇది జగన్ మైనస్ అయ్యింది. చంద్రబాబుకి 2024 ఎన్నికలలో అధికారం వచ్చేలా చేసింది. సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తానని, 2029 ఎన్నికలలో అన్నిటిని పూర్తి చేస్తానని చెబుతున్న.. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.అప్పటి నవ నగరాలు కూడా పక్కకి వెళ్లిపోయాయి, డెవలప్మెంట్ యాక్టివేషన్ చూస్తే మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చేసేలా కనిపించడం లేదు.
సెకరెట్రీయట్ భవనము, హైకోర్టు భవనం వంటివి పూర్తి చేసే పనిలో పడ్డారు. టిడిపి సోషల్ మీడియా, నేతల ప్రచారం చేస్తున్నట్లుగా అమరావతి ఇలా ఉంటుందంటూ గ్రాఫిక్స్ లో చూపించినంత ఆచరణ అనేది ఐదేళ్లలో సాధ్యం కాదంటూ వినిపిస్తున్నాయి. మరి ఈ మాత్రం చేసిన ప్రజల సంతృప్తి పడతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?. పోలవరం గురించి టిడిపి అనుకూల మీడియాలోనే ఇలా రాసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా ఏమవుతున్నాయో తెలియదు. ఆ డబ్బులు నిర్వాసితులకు ఇవ్వట్లేదని ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉండిపోయాయని తెలిపారు. పోలవరం పనులు చేయడానికి డబ్బులు ఉండి వృధాగా అవుతున్న పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం ఎందుకు అమరావతి, పోలవరం వంటివి పట్టించుకోలేదు.. ఈ రెండు కూడా ఏపీకి చాలా అవసరం వీటిని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎన్నికల ముందు వరకు వీటిని ఇలాగే తీసుకువచ్చి ఒకవేళ మళ్లీ జగన్ అధికారంలో వస్తే ఇదంతా పోతుందని భయపెట్టడానికి చేస్తే కనుక కచ్చితంగా మళ్లీ చంద్రబాబుకి ఎదురుదెబ్బే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.