అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి భారతదేశంతో ఇతర దేశాలతో స్నేహపూర్వకంగానే ఉన్నట్టు ఉండి వెనుక నుంచి 'కర్ర కాల్చి వాత పెట్టినట్టు' ఇబ్బందులకు గురి చేస్తున్నాడు .. ఇదే తరుణంలో ఇప్పటికే ఇండియా పై సుంకలు విధించడం వంటివి చేస్తూ ప్రతీకార చర్యలు తీర్చుకుంటున్నాడు. ఓవైపు మనం స్నేహపూర్వకంగానే ఉండాలి, ఒకరికొకరం సహకరించుకోవాలి అంటూనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో  కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.  ట్రంప్ ఏది చేసినా వారి దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు మన దేశ మూలాలు ఉన్న వ్యక్తుల తోటే అమెరికాలో ఈ పనులను చేయిస్తున్నారు. 

తులసి గబ్బర్డు, కాష్ పటేల్  వీళ్ళిద్దరిని కీలకమైన నిఘా వ్యవస్థలో నియమించారు. వీరిద్దరూ కూడా భారత మూలాలు ఉన్న వ్యక్తులే..కానీ వీరు ట్రంప్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ ను గద్దె దించాలని  కోరుతూ వైట్ హౌస్ పై  దాడి చేసిన సమయంలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దానిపై దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ దర్యాప్తులో కాష్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. అయితే వీరి టీం తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుడున్నటువంటి స్పీకర్ నాన్సీ ఫెలోసి  కీలక పాత్ర పోషించిందని దర్యాప్తులో తేలింది.

జనవరి 6వ తేదీన జరిగినటువంటి ఈ దాడుల్లో ఆమె ఆధ్వర్యంలో నేషనల్ గాడ్స్ ఒక్కరు కూడా అక్కడ లేకుండా చేసింది. న్యాన్సీ ఫెలోసి  ఆమె టీమంతా కలిసి అక్కడ జరిగిన గొడవలను వీడియో షూట్ చేయించి, ఈ వీడియోను మొత్తం హెచ్ బిఓ కు అమ్మింది. జనవరి 6న, 250 మంది ఎఫ్బీఐ ఏజెన్సీ యూనిఫాంలో కాకుండా మఫ్టీ లో ఉన్నారని నాన్సీ ఫెలోసి చెప్పింది. కానీ అక్కడ ఏ ఒక్కరిని కూడా నియమించలేదు. ఈ విధంగా కావాలనే దాడులను ప్రేరేపించిందని దర్యాప్తులో తేలింది. మరి దీన్ని అక్కడి న్యాయస్థానాలు అంగీకరిస్తాయా, న్యాన్సీ ఫెలోసిని అరెస్టు చేస్తారా అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: