
ఈ మల్టీప్లెక్స్ సంక్రాంతి 2026 నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో సినిమా థియేటర్లతో పాటు, ఈ కాంప్లెక్స్‌లో షాపింగ్, డైనింగ్ స్పేస్‌లు మరియు కుటుంబం అంతా ఎంజాయ్ చేయగల గేమ్ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇది కేవలం సినిమాకే కాకుండా, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌గా నిలవబోతోంది. గచ్చిబౌలిలోని AMB సినిమాస్ ఇప్పటికే ప్రీమియం థియేటర్ అనుభవానికి నాంది పలికినట్టే, rtc క్రాస్ రోడ్స్‌లోని AMB క్లాసిక్ కూడా అదే స్థాయి ప్రతిష్ఠను సొంతం చేసుకునే అవకాశం ఉంది. సినీ ప్రేమికులు, మహేష్ బాబు అభిమానులు అందరూ ఇప్పుడు ఈ థియేటర్ ప్రారంభ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పాత ఓడియన్ థియేటర్ ప్లేస్‌లో 8 స్క్రీన్లతో మరో కొత్త మల్టీఫ్లెక్స్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు