
ఇంటి బాధ్యతలు తీసుకున్న శోభిత సినిమాలకు దూరంగా ఉంటోంది. నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నో సందర్భాలలో తమ లవ్ స్టోరీని చెప్పాలని నాగచైతన్యని చాలామంది అభిమానులు, నెటిజన్స్ అడిగారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య తమ ప్రేమ ఎక్కడ పుట్టింది? ఎలా మొదలయ్యిందనే విషయాలను తెలియజేశారు. మొదట తాము ఇంస్టాగ్రామ్ లో కలిసాము.. అసలు తన భాగస్వామిని అక్కడ కలుస్తానని తాను ఎప్పుడూ కూడా ఊహించలేదని.. ఒకరోజు, నేను షోయు గురించి ఒక పోస్ట్ చేసినప్పుడు ఆమె ఒక ఎమోజిని షేర్ చేసింది.
ఆ తర్వాత నేను బుజ్జి తల్లి అని ముద్దుగా రిప్లై ఇచ్చాను.. అప్పటినుంచి ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాను ఆ తర్వాత నెమ్మదిగా కలిశాము ,ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ఆ తర్వాతే మా పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాము.. కానీ బుజ్జి తల్లి అనే పాట కారణంగా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై కొద్ది రోజులపాటు కోపంగా ఉండేదని.. ఎందుకంటే నిజానికి శోభితని నేను ముద్దుగా బుజ్జి తల్లి అని పిలుస్తూ ఉంటాను.. నేనే దర్శకుడికి తండెల్ సినిమాలో ఉపయోగించమని అడిగానని శోభిత అనుకొని కొద్ది రోజులు తనతో మాట్లాడలేదని కానీ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని మాట్లాడిందంటూ తెలిపారు నాగచైతన్య.