గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ పేరు మారు మ్రొగిపోతూనే ఉంది.  ఎప్పుడూ ఆయన పేరు ట్రెండ్‌లోనే ఉంటుంది, కానీ ఈసారి మాత్రం కారణం మరింత స్పెషల్‌గా మారింది. దసరా పర్వదినం సందర్భంగా ఆయన తన గర్ల్‌ఫ్రెండ్‌గా  హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి నిశ్చితార్ధం జరుపుకున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి పేర్లు గత కొన్నేళ్లుగా మీడియాలో, అభిమానుల మధ్య, ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా నిలుస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండరష్మిక మందన్నా జంట తొలిసారి కలిసి నటించిన గీత గోవిందం సినిమాలో చూపించిన కెమిస్ట్రీ అంతా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ సినిమా తర్వాత వీళ్ళ మధ్య సన్నిహితత పెరిగిందని, కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చర్చలకు కారణమయ్యాయని తెలిసిందే. అయితే ఈ వరకు వీళ్ళిద్దరూ ఎప్పుడూ పబ్లిక్‌గా తమ ప్రేమను అంగీకరించలేదు, లేదా పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, అభిమానులు మాత్రం వీళ్ళిద్దరూ ఓ హ్యాపీ కపుల్‌గానే ఉన్నారని నమ్ముతూనే ఉన్నారు.


ఇదే సమయంలో, సోషల్ మీడియాలో మరో వార్త ఆకస్మాత్తుగా హడావుడి రేపింది — హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైందన్న వార్త. ఈ వార్త విని ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, సోమవారం సాయంత్రం విజయ్ దేవరకొండ మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వైపు కారులో బయలుదేరారు. ప్రయాణం జరుగుతున్న సమయంలో ఉండవెల్లి మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారి వద్ద, వినాయక పత్తి మిల్లు దగ్గర ఒక బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అకస్మాత్తుగా ఆగిపోవడంతో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆ క్షణం అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకపోవడం అభిమానులకు ఊరటనిచ్చింది.



డ్రైవర్ అందే శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఇది జరిగిన 24 గంటల కాక ముందే  విజయ్ దేవరకొండ కారుకు ఓవర్‌స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ విధించినట్లు సమాచారం. దాంతో ఈ ప్రమాదం కూడా ఓవర్‌స్పీడ్ వల్లే జరిగిందా? లేక వేరే కారణం ఉందా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ ఘటనకు మరో కోణం తెచ్చారు. కొంతమంది నెటిజన్లు “దేవుడు ఆల్రెడీ హింట్ ఇచ్చాడు — స్పీడ్ తగ్గించుకోమని, కానీ వినలేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం “ఇది చిన్న ఘటన మాత్రమే, దేవుడి దయతో పెద్ద ప్రమాదం జరగలేదు” అంటూ సానుకూలంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: