
ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ తెలుగు స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఈ హీరోకి మంచి పేరు ఉంది, మంచి ప్రతిష్ట ఉంది. వ్యక్తిగతంగా చాలా బాగా ఉంటాడు — అందంగా, స్మార్ట్‌గా కనిపిస్తాడు, మాట్లాడే తీరు కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన వివాహ బంధం చాలా ట్రోలింగ్ కి గురు అవుతుంది. ఆయన తన భార్యతో దూరంగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని సమాచారం. ఇక విషయం ఇంతటితో ఆగలేదు — లీగల్‌గా విడాకుల ప్రక్రియను ప్రారంభించారని కూడా కొన్ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫేవరెట్ హీరో ఇలా వ్యవహరిస్తున్నారని నమ్మలేకపోతున్నారు.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తూ..“మీరు మాకు ఆదర్శం, మిమ్మల్ని చూసి మేము జీవితంలో ముందుకు వెళ్తాం. అలాంటి మీరు ఇలా విడాకులు తీసుకుంటే మాకు ఏం చెప్పగలరు?” అంటూ మండిపడుతున్నారు.మరికొందరు వ్యాఖ్యానిస్తూ, “సినిమా వాళ్లు స్క్రీన్ మీద చూపించే ప్రేమ అసలైన జీవితంలో ఉండదా?” అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని అనఫిషియల్‌గా ధృవీకరించారని టాక్. దీంతో ఆ హీరో కెరీర్‌పైనా, వ్యక్తిగత జీవితంపైనా ఈ సంఘటన ప్రతికూల ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్టార్ సెలబ్రిటీలే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాట చెబుతున్నారు — “మా హీరో హ్యాపీగా ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం, కానీ ఇలా విడిపోవడం చూడలేం.” అంటూ న్యూట్రల్ గా స్పందిస్తున్నారు..!!