
పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో నితిన్ కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావించాయి. కానీ, ఆ మధ్య వచ్చిన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలు తీవ్రంగా దెబ్బతీయడంతో దిల్ రాజు వెనక్కు తగ్గాడు. నితిన్ కూడా విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్ వైపు మళ్లడంతో వేణు మళ్లీ హీరో కోసం వెతకాల్సి వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఫైనల్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల ‘కిష్కింధపురి’తో సాలిడ్ హిట్ కొట్టిన శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ తన పంజా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఉత్తరాదిలో కూడా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకు అదనపు బలం అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
‘యల్లమ్మ’ను కేవలం తెలుగు మార్కెట్‌కే పరిమితం చేయకుండా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాదిలోని ప్రేక్షకులు కూడా ఈ కథతో కనెక్ట్ అవుతారని టీం విశ్వాసంగా ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే - శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా ఈ సినిమాకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఇస్తారని సమాచారం. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా, వేణు డైరెక్టర్‌గా, బెల్లంకొండ హీరోగా ఉండటం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ గట్టిగానే ఉంది. మంచి కథ, బలమైన సబ్జెక్ట్‌తో వచ్చే ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వేణు డైరెక్షన్‌లో ‘బలగం’ తరహా మరో ఎమోషనల్, కంటెంట్ బేస్డ్ మాస్ డ్రామా వస్తుందనే అంచనాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ‘యల్లమ్మ’ పేరు వినగానే ప్రేక్షకుల్లో కలుగుతున్న హైప్ చూస్తే… ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపే ఛాన్స్ ఉందని చెప్పాలి.