
అలాంటి వ్యక్తులకు సంబంధించి జీవిత చరిత్ర సినిమాగా తీస్తే కొన్ని కోట్ల మందికి ఈ విషయం చేరుతుంది. కానీ అలాంటి వారి బయోపిక్ తీయడానికి టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరో కూడా ఆసక్తి చూపించలేదట .కానీ తాజాగా అలాంటి రాజకీయ నేత బయోపిక్ తీయడానికి కన్నడ హీరో ముందుకు వచ్చారు. గుమ్మడి నరసయ్య గొప్పతనాన్ని గుర్తించి ఆయన బయోపిక్ లో నటించడానికి మక్కువ చూపుతున్నారు శివరాజ్ కుమార్. ముఖ్యంగా రాజకీయ వేతగా పేరుపొందిన గుమ్మడి నరసయ్య గురించి తెలిసి ఆశ్చర్యపోయారట శివరాజ్ కుమార్.
దీంతో నేరుగా ఆయన ఇంటికి వెళ్లి మీ జీవితాన్ని జనాలకు చూపించాలి మీ పాత్రలో నటించేందుకు అనుమతి ఇవ్వండి అంటూ శివరాజ్ కుమార్ కోరినట్లు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఎవరు ఈ గుమ్మడి నరసయ్య అనే విషయం తెలుసుకోవడం కోసం నేటిజన్స్ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది నేతలు బయోపిక్ లు వచ్చాయి.. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గుమ్మడి నరసయ్య వంటి రాజకీయనాయ నేత బయోపిక్ తీయడానికి టాలీవుడ్ లో హీరోలు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. తన ఊరి జనాలకు ఎన్నో సేవలు చేస్తూ పేరు సంపాదించడమే కాకుండా తన జీవితంలో ఎన్నో విజయాలు, అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో తన ఊరు సమస్యలు చెప్పి ఫండ్ అడిగేందుకు సీఎంను కలవడానికి ప్రయత్నిచ్చినప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదట. ఈయన బయోపిక్ తీస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.