
ఎన్నికలు జరగబోతున్నాయంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకురాబోతుంది..? అనే విషయాల కంటే.. “ఈసారి ఎవరు ఎంత ఇస్తారు?” అనే చర్చే ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్ — అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ బయటకు ఒప్పుకోవడం మాత్రం కొంచెం కష్టం. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అక్కడ “ఓటుకు ఎంత ఇస్తారు?” అనే విషయంపై కొందరు ఘాటుగా, సరదాగా చర్చించుకుంటున్నారు. కొంతమంది “ఈసారి డబ్బులు ఇవ్వడం కాదు, మంచి పథకాలను ప్రవేశపెట్టాలి” అని అంటుంటే, మరికొందరు మాత్రం “అది ఎప్పుడూ వింటున్న టాపిక్” అంటూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 1000,2000, ₹5000, మరికొన్ని కాంపిటిషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ₹15000 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో బీహార్ ఎన్నికలకు సంబంధించిన టాపిక్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మరియు ఇండియా కూటమి మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా మారబోతోందని పలు సర్వేలు చెబుతున్నాయి.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పెద్దఎత్తున మారబోతున్నాయని చిరాగ్ పస్వాన్ అంటున్నారు. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ తనదైన వ్యూహంతో, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది అన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, నిజమైన ఫలితం నవంబర్ 14న మాత్రమే తెలిసేది — ఎందుకంటే నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఊహాగానాలు, చర్చలు, విశ్లేషణలే కొనసాగుతాయి.