
ఈ రెండు సినిమాలకూ వేరువేరు ప్రత్యేకతలు ఉన్నా, ఇద్దరు హీరోల కెరీర్ పరిస్థితులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం గతంలో “క” సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ రు. 50 కోట్ల విజయంతో కిరణ్‌పై మళ్లీ మంచి హైప్ ఏర్పడింది. కానీ దాని వెంటనే వచ్చిన “దిల్ రుబా” మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంది. దాంతో కిరణ్ కెరీర్ మళ్లీ డౌన్ అవుతున్నట్టే అనిపించింది. ఇప్పుడు “కె రాంప్” ద్వారా మళ్లీ సక్సెస్ బాట పట్టాలని కిరణ్ ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాపై అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. సరికొత్త కాన్సెప్ట్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో యూత్‌ను ఆకట్టుకోవాలని టీమ్ భావిస్తోంది.
ఇక సిద్దు జొన్నలగడ్డ విషయానికి వస్తే, అతడి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. “టిల్లు స్క్వేర్” తో సిద్దు ఒక స్టార్ లెవెల్ క్రేజ్ సాధించాడు. కానీ ఆ క్రేజ్‌ని నిలబెట్టుకునే అవకాశం ఇచ్చిన “జాక్” మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మారి కెరీర్‌కు నష్టం చేసింది. ఆ సినిమా తర్వాత సిద్దుపై వచ్చిన నెగిటివ్ వేవ్, సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అతనిని కొంత వెనక్కి నెట్టాయి. ఇప్పుడు “తెలుసు కదా”తో సిద్దు మళ్లీ తన ఫామ్‌ను రీగైన్ చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ రోజు వచ్చిన ఈ సినిమాకు మంచి టాకే వస్తోంది.
ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నారు. ఒక్క హిట్‌తో మళ్లీ పైకి ఎగురగలరు; ఫ్లాప్ అయితే మళ్లీ కెరీర్ స్టేబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ దీపావళి బాక్సాఫీస్ ఫైట్ కేవలం సినిమాల మధ్య పోటీ మాత్రమే కాదు, కిరణ్ అబ్బవరం - సిద్దు జొన్నలగడ్డ కెరీర్ టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఈ “కె రాంప్” – “తెలుసు కదా” సినిమాలు ఎవరి బ్యాలెన్స్ షీట్ సరిచేస్తాయో, ఎవరు మళ్లీ ఫామ్‌లోకి వస్తారో ఈ పండుగే నిర్ణయించబోతోంది.