ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ప్రతి మహిళ మనసులో ఒక పవిత్రమైన కోరిక. ఒక కొత్త జీవితాన్ని తన గర్భంలో చూసుకోవడం, తన శరీరంలో మరో జీవం పెరుగుతుండటం అనేది ఏ స్త్రీకైనా ఆకాశానికంటే గొప్ప అనుభూతి. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఆ ఆనందాన్ని, ఆ మాతృత్వపు క్షణాలను అనుభవించాలని కలలు కంటుంది.అయితే, ఈ మధ్యకాలంలో సమాజంలో కొంతమంది మాత్రం ఈ పవిత్రమైన ప్రెగ్నెన్సీ అనే అంశాన్ని సరదాగా, తప్పు దారిలో తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో, కొంతమంది దీన్ని సరదా జోక్‌లా, గిమ్మిక్‌లా మార్చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల సౌత్ ఇండస్ట్రీకి చెందిన అందమైన నటి రెజీనా కసాండ్రా ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూలో చెబుతూ, తన జీవితంలోని ఓ సరదా సంఘటనను బయట పెట్టింది. తెలుగు ప్రేక్షకులకు రెజీనా పేరు కొత్తేమీ కాదు. ఆమె ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే తన అందం, నటన, ఆత్మవిశ్వాసంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా మంచి పేరు సంపాదించింది. రెజీనా నటించిన సినిమాలు హిట్ అవుతాయని ఒక నమ్మకం అభిమానుల్లో ఏర్పడిపోయింది.

తన లుక్‌లు, ఫ్యాషన్ సెన్స్, పర్సనాలిటీతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే రెజీనా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ‘ఫుడ్ లవ్’ గురించి చెప్పింది. ఆమె మాటల్లోనే –“నాకు ఫుడ్ అంటే ప్రాణం! ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటా. మంచి ఫుడ్ ఉంటే ఎక్కడికైనా వెళ్తా. అది నా వీక్‌నెస్.”అలా ఒకసారి బెంగళూరులో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆమెకు బెంగాలీ స్వీట్ — ‘మిష్టీ దోయ్’ — తినాలనిపించిందట. కానీ ఎంత వెతికినా ఆ స్వీట్ ఎక్కడా దొరకలేదట. చివరికి ఒక షాప్‌లో దొరికినా అప్పటికే టైమ్ అయిపోయి షాప్ మూసేస్తుండగా, సేల్స్ బాయ్ "సారీ మేడమ్, షాప్ క్లోజ్ అయిపోయింది" అని చెప్పేశాడు.

అప్పుడు రెజీనా ఆ స్వీట్ తినాలనే కోరికను అనుచుకోలేక, సరదాగా ఒక అబద్ధం చెప్పిందట. “నేను ప్రెగ్నెంట్..నాకు అది తినాలని చాలా కోరిక ఉంది. అని.. చివరికి షాప్ కీపర్‌ ని నమ్మించి.. ఆయన చేత  షాప్ మళ్లీ ఓపెన్ చేసి స్వీట్ తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత ఆలోచించగా నవ్వొచ్చింది అంటూ చెప్పింది. అలా తన స్వీట్ క్రేవింగ్ తీర్చుకోవడానికి ఒక చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటూ నిజాని బయటపెట్టింది. ”ఈ సంఘటనను రెజీనా నవ్వుతూ చెప్పినా, సోషల్ మీడియాలో మాత్రం జనాలు దీనికి విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఇది సరదాగా తీసుకోగా, మరికొందరు “ఇలాంటి పవిత్రమైన విషయాన్ని సరదా కోసం వాడుకోవడం సరికాదు” అంటూ విమర్శిస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు —“ప్రెగ్నెన్సీ అంటే ఒక స్త్రీ జీవితంలో గొప్ప బాధ్యత. దాన్ని మీ ఇష్టాల కోసం అబద్ధంగా వాడుకోవడం మంచిది కాదు.”మరికొందరు మాత్రం “ఇది సరదాగా చెప్పిన జోక్ మాత్రమే, అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు” అని రెజీనాను సపోర్ట్ చేస్తున్నారు.ఏదేమైనప్పటికీ, ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రెజీనా మళ్లీ చర్చల్లోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: