కిరణ్ అబ్బవరం హీరోగా.. యుక్తి తరేజా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ కె ర్యాంప్.. జేమ్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రుద్రాంశ్ సెల్యులాయిడ్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు.. అలా దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదలై మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కామెడీ సన్నివేశాలలో అదరగొట్టారని, ఈ రేంజ్ కామెడీ ఊహించలేదంటూ ఆయన ఫ్యాన్స్ రివ్యూ ఇచ్చారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుండడమే కాకుండా హీరో యాక్టింగ్, కామెడీ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే అలాంటి అద్భుతమైన స్టోరీ తో తెరకెక్కిన కే ర్యాంప్ మూవీని మరో హీరో రిజెక్ట్ చేశారట.ఆ హీరో రిజెక్ట్ చేయడంతో కిరణ్ అబ్బవరం చేతిలోకి వచ్చిందట. మరి ఇంతకీ ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

కొంతమంది నటీనటులు సిల్లీ సిల్లీ రీజన్స్ తో తమ చేతిదాక వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటారు. కానీ అలా వదిలేసాక ఆ సినిమాలు హిట్ అయితే మాత్రం బాధపడతారు.అయితే తాజాగా విడుదలయినా కే ర్యాంప్ మూవీ ని కూడా మరో హీరో మిస్ చేసుకున్నారట.ఆ హీరో ఎవరయ్యా అంటే నితిన్.. వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న నితిన్ దగ్గరికే మొదట ఈ సినిమా వెళ్ళిందట. అయితే కథ బాగుండడంతో మొదట చేస్తానని ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కొంచెం ఆలోచనలో పడి ఇలాంటి కథలో నటించాల్సిన హీరోకి ఎలాంటి బ్యాగేజ్ ఉండకూడదు.

ఇలాంటి సినిమాల్లో నేను నటిస్తే వర్కౌట్ అవ్వవు మంచి స్టోరీ ప్లాఫ్ అవుతుంది అని రిజెక్ట్ చేశారట. అలా నితిన్ రిజెక్ట్ చేయడంతో కిరణ్ అబ్బవరం దగ్గరికి ఈ స్టోరీ వెళ్ళింది.అలా కిరణ్ అబ్బవరం కి ఈ సినిమా నచ్చి ఆయన చేయడానికి ఒప్పుకున్నారు.అలా నితిన్ ఈ సినిమాను మొదట రిజెక్ట్ చేశారంటూ ఫిలిం ఇండస్ట్రీలో ఓ రూమర్ వినిపిస్తోంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నితిన్ ఫాన్స్ ఛ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.. దురదృష్టం అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: