ఇప్పుడే ఎక్కడ చూసినా సరే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు మారు మ్రోగిపోతుంది. కేవలం కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రుక్మిణి వసంత్, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆమె కెరీర్ స్టార్ట్ చేసిన సమయం ఎక్కువ కాలం కాకపోయినా, ఆమె ఎంచుకుంటున్న సినిమాలు.. పాత్రలు, ఫోటోషూట్స్ — ఇవన్నీ ఆమెను స్పాట్‌లైట్‌లో ఉంచుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో, రుక్మిణి వసంత్ ను ఒక సెన్సేషన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవల రీసెంట్‌గా వచ్చిన ‘కాంతారా’ సినిమాతో ఆమె క్రేజ్ ఆకాశాన్నంటింది. ఆ సినిమాలో ఆమె నటన, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు వచ్చే ఆఫర్స్ సంఖ్య రెట్టింపయ్యింది. ప్రస్తుతం ఏ పాన్  ఇండియా మూవీ సెట్ అవుతున్నా, అందులో హీరోయిన్‌గా “రుక్కు” (ఫ్యాన్స్ ప్రేమగా పిలిచే పేరు) ఉండాలనే డిమాండ్ కనిపిస్తోంది.

అంతే కాదు, సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్  పేరు ప్రస్తుతం హీట్ పెంచేస్తోంది. ఆమెకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం ఇప్పుడు నెటిజెన్స్ మధ్య బాగా చర్చనీయాంశమైంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, రుక్మిణి వసంత్ ఒక స్టార్ హీరో కుమారుడితో ప్రేమాయణంలో మునిగి తేలుతోందని కన్నడ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే — సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే ఆ స్టార్ హీరో కొడుకుతో రుక్మిణి స్నేహం ప్రారంభమైనట్లు టాక్. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందని చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరిదీ అధికారిక ప్రకటన రాలేదు.

‘కాంతారా 1’ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ హీరో కొడుకు సోషల్ మీడియా వేదికగా రిషబ్ శెట్టి నటనను, అలాగే రుక్మిణి వసంత్  అందాన్ని, నటనను ప్రశంసిస్తూ పరోక్షంగా పోస్ట్‌లు చేయడం గమనార్హం. అప్పుడే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఇప్పుడు మళ్లీ అదే విషయం మళ్లీ తెరపైకి రావడంతో, అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.ప్రస్తుతం రుక్మిణి వసంత్  కేవలం కన్నడలోనే కాదు, తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమల్లో కూడా బలమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె గ్లామర్‌తో పాటు నటనలోనూ సత్తా చూపుతోంది. అయితే, ఈ రకమైన పర్సనల్ రూమర్స్ ఆమె కెరీర్‌కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా, ప్రస్తుతం రుక్మిణి వసంత్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తదుపరి సినిమాలు ఏవో, ఆమె నిజంగా ఎవరి ప్రేమలో ఉందో అనే కురియాసిటీతో ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: