తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆయనకు ఇంతటి గౌరవం ఒక్కసారి వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ల కృషి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఎంతో కష్టపడి మెగాస్టార్ అయ్యారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూసేవారు. అలాంటి చిరంజీవి పేరుతో ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వచ్చారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్.. ఈయన అన్న ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో అడుగుపెట్టి తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఈ విధంగా మెగా ఫ్యామిలీ దూసుకుపోతున్న తరుణంలో  సోషల్ మీడియాలో  ఒక వార్త వైరల్ అవుతుంది. పొత్తు లేకుండా మెగా ఫ్యామిలీ బ్రతకలేదంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. మరి ఇలా విమర్శలు ఎందుకు చేస్తున్నారు.. అనే వివరాలు చూద్దాం..

 చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్లు మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. అయితే తాజాగా ఆయన చిత్ర యూనిట్ తో కలవగా గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ ఎంతో సంబరపడిపోతున్న మరో వర్గం వారు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తాను తీసే సినిమాలపై తనకు నమ్మకం లేకుండా పోయిందని, అందుకే తన ప్రతి సినిమాలో వేరే హీరోలని స్పెషల్ గెస్ట్ ల కింద తీసుకువస్తున్నారని  అంటున్నారు.

సైరా చిత్రంలో అమితాబ్ బచ్చన్, గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్, వాల్తేరు వీరయ్యలో రవితేజను తీసుకొచ్చారు. అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేశ్ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ విధంగా ఆయన సింగిల్ గా రాలేకపోతున్నారని ఏదో ఒక హీరోతో సినిమాల్లో పొత్తు పెట్టుకుని వస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా  పొత్తు పెట్టుకుని  డిప్యూటీ సీఎం అయ్యారని, ఇలా మెగా ఫ్యామిలీ అన్నదమ్ములు పొత్తు లేకుండా బ్రతకలేకపోతున్నారంటూ  మెగా యాంటీ అభిమానులు  సోషల్ మీడియాలో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: