అయితే ఇప్పుడు ఉపాసన స్వయంగా తన రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని ధృవీకరించింది. ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. “ఈసారి మా ఇంటి దీపావళి డబుల్ స్పెషల్... డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ బ్లెస్సింగ్స్!” అంటూ ఉపాసన తన మినీ సీమంతం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఉపాసన చాలా గ్లో అయ్యి కనిపిస్తోంది. అయితే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ఉపాసన ఈరోజే ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టింది? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి రోజున కూడా ఆమె ఈ గుడ్ న్యూస్ చెప్పవచ్చు కదా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ దీని వెనుక ఒక స్పెషల్ కారణం ఉందట.
ఉపాసనకు బాబా (శిరిడీ సాయిబాబా) మీద ఎంతో భక్తి ఉంది. ఇటీవల ఆమె సాయిబాబా పూజలో పాల్గొన్న వీడియో కూడా వైరల్ అయ్యింది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఉపాసన ఏ మంచి పని చేయాలన్నా లేదా జీవితంలో ఏ మంచి విషయాన్ని ప్రకటించాలన్నా గురువారం రోజునే చేస్తుందట. ఎందుకంటే ఆమెకు గురువారం అనేది ఒక లక్కీ డే. అదే సెంటిమెంట్ ఈసారి కూడా ఫాలో అయిందట. అందుకే ఈరోజు గురువారం కావడంతో, తన రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని పబ్లిక్‌గా ప్రకటించిందని అభిమానులు చెబుతున్నారు. “గురువారం రోజున ప్రకటిస్తే బాబా ఆశీస్సులు మరింతగా లభిస్తాయి” అనే విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకుందట ఉపాసన.
ఇక సోషల్ మీడియాలో ఉపాసన మినీ సీమంతం వీడియో ఇప్పుడు రికార్డు స్థాయిలో వైరల్ అవుతోంది. అభిమానులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీలు కామెంట్స్, శుభాకాంక్షలతో నిండిపోతున్నారు.కొంతమంది ఫ్యాన్స్ “ఈసారి కచ్చితంగా కొడుకే పుడతాడు” అంటూ ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది మాత్రం “అబ్బాయో అమ్మాయో పెద్ద విషయమే కాదు, తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం” అంటూ ప్రేమతో రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి, ఉపాసన రెండోసారి తల్లి కాబోతుందనే ఈ వార్త మెగా అభిమానులకు పండగే. ఉపాసన మినీ సీమంతం వీడియో వైరల్ అవుతుంది. ఈసారి నిజంగా “డబుల్ బ్లెస్సింగ్స్.. డబుల్ హ్యాపినెస్” అంటూ మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి