ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, పశుపతి , డైరెక్టర్ మారి సెల్వరాజ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బైసన్. ఈ సినిమా దీపావళి కానుకగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.తెలుగులో ఈరోజు (అక్టోబర్ 24) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే:
1990 లో సాగేటువంటి సినిమా కథ ఇందులో కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్) కబడ్డీ ఆటలో రాణిస్తుంటారు. తన కుమారుడు భవిష్యత్తు పాడవుతుందని ఉద్దేశంతో కిట్టయ్య తండ్రి వేలుసామి(పశుపతి) తన కుమారుడిని కబడ్డీ ఆట ఆడొద్దని ఆదేశిస్తారు. వారి గ్రామంలో కుల వివక్ష ఎక్కువగా ఉండడంతో కిట్టయ్య కుటుంబాన్ని కూడా తొక్కేయాలని ఇతర కులాల వారు ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో కిట్టయ్య కబడ్డీ ఆడుతాడు. ఆ క్రమంలోనే కిట్టయ్యకు ఎదురయ్యే సమస్యలు ఏంటి? కబడ్డీ లో రాణిస్తాడా? గ్రామంలో ఉన్న కుల వివక్షతను హీరో చెరిపేస్తారా అనేది సినిమా కథ


సినిమా ప్లస్ పాయింట్స్:
డైరెక్టర్ మారి సెల్వరాజ్ సమాజంలో జరుగుతున్న విషయాలను అద్భుతంగా చూపించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో చూపించిన అంశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. గ్రామం స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అణిచివేతకు గురయ్యే కథను చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ మారి సెల్వరాజ్.

హీరో ధృవ్ విక్రమ్ తన పాత్ర కోసం చాలని కష్టపడినట్లు కనిపిస్తోంది. ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితమే వెండితెరపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించారు.

నటుడు పశుపతి ప్రేమ, భయంతో  కూడిన తండ్రి  పాత్రలో అద్భుతంగా నటించారు. ధ్రువ్, పశుపతి మధ్య వచ్చే సిన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. రజిషా విజయన్, అమీర్, లాల్ తమ పాత్రల అద్భుతంగా నటించారు.

అనుపమ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో అద్భుతంగా నటించింది.

మైనస్ పాయింట్స్:
బైసన్ చిత్రాన్ని అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ మాణాతి గణేషన్ కథ ఆధారంగా తీశారు.. ఇందులో ఎమోషన్స్ సన్నివేషాలు చూపించాలనే ప్రయత్నంలో చాలా సాగదీసినట్లుగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో వచ్చే రిపీటెడ్ సీన్స్, ఊహించగలిగిన కథనం ఈ సినిమాకి మైనస్ గా మారింది.
 
సినిమా స్పోర్ట్స్ డ్రామా బ్యాగ్రౌండ్ లో ప్రజెంట్ చేయాలని చూసినప్పటికీ ఇందులో సామాజిక అంశాలు ఎక్కువగా ప్రభావితం అయ్యేలా చేశాయి.

తెలుగు డబ్బింగ్ సరిగ్గా లేకపోవడం, తమిళ సైన్ బోర్డులు ,వార్తాపత్రికలు , టాటోలు  వంటివి ట్రాన్స్లేట్ చేయకపోవడంతో ఈ సినిమాకి మైనస్ గా మారింది.

ఓవరాల్ గా బైసన్ సినిమా చూస్తే అణచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేస్తూ స్పోర్ట్స్ డ్రామాగా  తీసిన తీరు పర్వాలేదనిపించింది. ధ్రువ్ విక్రమ్, పశుపతి ఈ సినిమాకు ప్లస్. స్పోర్ట్స్ డ్రామా ఇష్టపడే వారికి ఈ సినిమా బెటర్.

రేటింగ్ :2.78/5

మరింత సమాచారం తెలుసుకోండి: