సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు కెరియర్ను స్టార్ట్ చేశాక వారికి మంచి క్రేజ్ వచ్చి మంచి విజయాలు దక్కి స్టార్ హీరోయిన్లుగా స్థాయికి ఎదిగిన తర్వాత అలా కూడా చాలా సంవత్సరాలు కేరిర్ ను ముందుకు సాగించినట్లయితే ఆ తర్వాత వారు కెరియర్ ప్రారంభంలో చేసిన రకం సినిమాలలో కాకుండా కాస్త వైవిధ్యమైన సినిమాలలో , తమ పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలలో నటించడానికి అత్యంత ఇష్టపడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో నటించినట్లయితే నటిగా వారికి అద్భుతమైన గుర్తింపు దక్కుతుంది కాబట్టి స్టార్ హీరోయిన్లుగా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన నటీ మణులు ఆ దిశగా అడుగులు వేస్తారు అని చాలా మంది భావిస్తూ ఉంటారు.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్తలో నటించిన సినిమాలలో చాలా వరకు తన అందాలను భారీగా ఆరబోసింది. ఈమె ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ ను పెంచింది. ఇలా కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో గ్లామర్ షో ఉన్న సినిమాల్లో అస్సలు నటించడం లేదు. ఈమె ఈ మధ్య కాలంలో అనుష్క సినిమాల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించింది. అలా ఈమె నటించిన తక్కువ సినిమాల్లో కూడా ఎక్కడ ఈమె గ్లామర్ షో చేయకుండా జాగ్రత్తలు పడుతుంది. ఈమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ వస్తుంది. దానితో చాలా మంది అనుష్క ఇకపై గ్లామర్ షో కు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయదా అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: