గతంతో పోలిస్తే రీసెంట్ టైం లో తెలుగు సినీ పరిశ్రమలో రైటర్లు చాలా వరకు తగ్గిపోయారు అని చాలా మంది ఒక వాదనను గట్టిగా వినిపిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. దాదాపుగా ఇది వాస్తవం. గతంలో ఒక సినిమా దర్శకుడి దగ్గర ఎంతో మంది రైటర్స్ ఉండే వారు. దర్శకుడు ఒక సినిమా స్టార్ట్ చేయక ముందు ఒక హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెబితే ఆ హీరోకు ఎలాంటి కథ అయితే సూట్ అవుతుంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ట్రేండింగ్ లో ఉన్నాయి అనే దానిని వారు పరిశీలించి ఓ కథను తయారు చేసేవారు.

ఆ తరువాత దర్శకుడికి , హీరోకి అది నచ్చితే అది సినిమాగా తయారు అయ్యేది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రైటర్స్ చాలా వరకు దర్శకులుగా మారిపోతున్నారు. ఇక ఇదే కోవ లోకి మరో రచయిత కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్ వీసా ఒకరు. ఈయన బసంతి సినిమాకు మాటల రచయితగా పని చేశాడు. ఈ సినిమాతోనే ఈయన తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన పుష్ప ది రైస్ ,  వెంకీ మామ ,  కిలాడి , రావణాసుర వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు.

ఇలా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు కథ రచయితగా పని చేసిన ఈయన దర్శకుడిగా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ హీరో గా సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా శ్రీకాంత్ వీసా , కళ్యాణ్ రామ్ ను కలిసి ఓ కథను వివరించగా కళ్యాణ్ రామ్ కి కూడా ఆ కథ బాగా నచ్చినట్లు దానితో శ్రీకాంత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr