ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ఏంటంటే — రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్! దసరా సందర్భంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు మొదట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక్క తెలుగు మీడియాలో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్ న్యూస్ ఛానల్స్ కూడా ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రత్యేక సెగ్మెంట్లు ప్రసారం చేశాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గాని, రష్మిక మందన్నా గాని ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అభిమానులు ఎన్నో ఊహాగానాలు చేస్తూ ఉండగా, ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ వార్తలు ఆ ఊహలకు మరింత బలం చేకూర్చాయి. కానీ ఆ నిశ్చితార్థం నిజమా? లేక రూమర్స్ మాత్రమేనా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.


అసలు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మీడియాలో కనిపించడం కూడా చాలా తక్కువైపోయింది. విజయ్ దేవరకొండ పూర్తిగా తన కొత్త సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక రష్మిక మందన్నా కూడా ఇటీవల ధామా ప్రమోషన్లతో కనిపించింది గానీ, ఆ తర్వాత ఒక్కసారిగా మీడియా నుంచి మాయమైపోయింది.ఇంతలోనే, ఆమె తాజాగా నటించిన “గర్ల్‌ఫ్రెండ్” అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో మల్టీప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరగబోతోందని సమాచారం బయటకొచ్చింది. ఈ ఈవెంట్‌కి రష్మిక మందన్నా హాజరుకానుందని తెలుస్తుంది. ఇప్పుడు మీడియా ప్రపంచం మొత్తం ఆమె వైపే దృష్టి సారించింది.



సోషల్ మీడియాలో ఉన్న గాసిప్స్ అన్నింటికీ క్లారిటీ వచ్చే అవకాశంగా ఈ ఈవెంట్‌ను రిపోర్టర్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఈ సారి మాత్రం రష్మిక మందన్నా ముందుకు రాగానే మొదటి ప్రశ్నగా “మీ ఎంగేజ్మెంట్ నిజమేనా?” అనే ప్రశ్న ఎదుర్కోవడం ఖాయం అని అంటున్నారు.ఇప్పటికే మీడియా వర్గాలు ఈ ప్రశ్నను ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలి అన్న దానిపై ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాయట. రష్మిక ఎలా స్పందిస్తుందో, ఆ సమాధానం ఇవ్వబోతుందా లేక సైలెంట్‌గా స్మైల్ చేస్తుందా అన్నది చూడాల్సిన విషయంగా మారింది.ఒకవేళ రష్మిక ఎంగేజ్మెంట్ గురించి స్పష్టమైన సమాధానం ఇస్తే, అది ఈ రోజు ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. ఎందుకంటే అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా ఈ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఏదైనా పోస్ట్ చేస్తాడా అనే ఆసక్తి కూడా పెరుగుతోంది. ఇద్దరి వైపు నుంచి ఏదైనా అధికారిక క్లారిటీ వస్తే, అది అభిమానులకు పండగే అవుతుంది.



అందుకే ఇప్పుడు అభిమానులు, మీడియా వర్గాలు, సోషల్ మీడియా యూజర్లు అందరూ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు —“రష్మిక–విజయ్ ఎంగేజ్మెంట్ నిజమేనా?” ఈరోజు హైదరాబాద్లో జరగబోయే “గర్ల్‌ఫ్రెండ్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అన్ని సమాధానాలు బయటపడే అవకాశం ఉంది. రష్మిక ఏం చెబుతుందో, ఆమె చిరునవ్వు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి అందరి చూపు ఆ ఒక్క స్టేజ్‌పైనే  ఉంది.రష్మిక నిశ్చితార్ధం గురించి మాట్లాడితే ఈ రోజు నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది — ఆమె అభిమానులకైతే ఇది మరచిపోలేని క్షణం అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: