వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా కూడా మళ్ళీ కొత్త కొత్త సినిమాలను ప్రకటిస్తూనే ఉంటారు రవితేజ. అయితే అలాంటి రవితేజ మరో కొత్త సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రవితేజ కు జోడిగా ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఇక రవితేజ, అనుష్క, త్రిష, కాజల్, రాశి కన్నా, శృతి హాసన్, ఇలియానా, శ్రీలీల  ఇలా ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు మొదలు యంగ్ హీరోయిన్ ల వరకు ఎంతో మందితో నటించినప్పటికీ ఇప్పటి వరకు సమంత తో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

 అయితే ఇప్పటివరకు వీరి కాంబోలో రాని సినిమా త్వరలోనే రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అది కూడా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్లో రవితేజ సమంత హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అయితే శివ నిర్వాణ ఇప్పటికే సమంతతో మజిలీ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

అలా మజిలీ సినిమా పరిచయంతో శివ నిర్వాణ సమంత ఇంటికి వెళ్లి స్టోరీ చెప్పగా సామ్ కి సినిమా స్టోరీ తెగ నచ్చేసిందట. దాంతో శివ నిర్వాణ కి ఈ సినిమా చేస్తానని మాట ఇచ్చిందట.ఈ మధ్యకాలంలో తెలుగులో ఎక్కువగా సినిమాలు ఒప్పుకోని సమంత ఫైనల్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో రవితేజ హీరోగా రాబోతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి వరుస ఫ్లాపుల్లో  ఉన్న రవితేజకు సమంత అయినా హిట్ అందిస్తుందా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: