తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ప్రియదర్శి చాలా సినిమాల్లో కమెడియన్ పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల్లో వరుస పెట్టి హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఈయన హీరో గా కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను సాధించడంతో హీరో గా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

కానీ ఈ మధ్య కాలంలో ఈయన హీరో గా నటించిన సినిమాలు చాలా వరకు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. కొంత కాలం క్రితం ఈయన డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. తాజాగా ఈయన మిత్ర మండలి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈయన ప్రేమంటే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఆనంది హీరోయిన్గా నటించింది. కొత్త డైరెక్టర్ నవనీత్‌ శ్రీరామ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నవంబర్ 21 వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

వరుస ప్లాప్ లు రావడంతో ప్రియదర్శి హీరో గా రూపొందున ప్రేమంటే మూవీ కి పెద్ద స్థాయి బిజినెస్ జరగదు అని చాలా మంది భావించారు. కానీ ప్రేమంటే మూవీ కి అద్భుతమైన నాన్ ధియేటర్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 9.50 కోట్ల ఖర్చుతో రూపొందించగా ఈ మూవీ కి నాన్ ధియేటర్ బిజినెస్ ద్వారానే 8 కోట్లు రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఇలా ప్రేమంటే మూవీ విడుదలకి ముందే చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: