సింగిల్ స్క్రీన్ సినిమాలు చూసే రోజులు పోయాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సింగిల్ స్క్రీన్లు తమ వైభవాన్ని కోల్పోయాయి. ఇది మల్టీప్లెక్స్ ల యుగం..ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లో సినిమాలు చూసి గొప్ప అనుభవాన్ని పొందుతున్నారు. అయితే డాల్బీ లాబరేటరీస్ ఇప్పుడు భారతదేశంలో ఆరు డాల్బీ సినిమా స్క్రీన్ లను ప్రారంభించినట్టు ప్రకటించింది. వాటిలో ఒకటి హైదరాబాదులోని అల్లు సినీప్లెక్స్ లో ఉంటుంది.. అల్లు కుటుంబం ఇప్పటికే అల్లు స్టూడియోలను నిర్మించింది. మరియు దాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా వాళ్లు అల్లో సినీ ఫ్లెక్స్ పేరుతో మల్టీప్లెక్స్ ని కూడా నిర్మిస్తున్నారు. అత్యాధిక పరికరాలతో అధునాతన సాంకేతికతతో కూడిన డాల్బీ స్క్రీన్ ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఏఎంబి గ్రూప్ కూడా బెంగళూరులోని ఏఎంబి సినిమాస్ లో కూడా ఈ స్క్రీన్ ని తీసుకురాబోతున్నారు. 

హైదరాబాదులో ఏఎంబి సినిమాస్ సక్సెస్ఫుల్ గా నిర్మించిన తర్వాత మహేష్ బాబు మరియు ఏషియన్ సినిమాస్ ఆ తర్వాత బెంగళూరులో లో కూడా స్థాపిస్తున్నారు. మిగిలిన నాలుగు స్క్రీన్లు పూణేలోని సిటీ ప్రైడ్, తిరుచ్చి లోని ఎల్ఏ సినిమా, కొచ్చిలోని ఈవీఎం సినిమాస్ మరియు ఉలిక్కల్ లోని జి సినీప్లెక్స్ లో డాల్బీ స్క్రీన్ లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాదులో డాల్బీ స్క్రీన్ లో నెక్స్ట్ మంత్ సినిమా రాబోతోంది అంటూ ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఏముందంటే.. ప్రియమైన హైదరాబాద్.. గెట్ రెడీ మీరు అదృష్టవంతులు అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం ఫార్మాట్ డాల్బీ సినిమాలో మీరు అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని చూస్తారు.. ఇందులో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అనుభవం ఉంటుంది. 

75 అడుగుల వెడల్పు గల DCI ఫ్లాట్, 1.85 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ పై డాల్బీ 3D తో డాల్బీ విజన్ (-4% అదనపు సినిమా తర్వాత 1.90) రిఫ్లెక్షన్ తో రూపొందించబడిన పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్ ఆడిటోరియం మరియు ప్రపంచ స్థాయి అకౌస్టిక్ వాతావరణం లో స్టూడియో గ్రేడ్ ఇమ్మర్సీవ్ డాల్బీ అట్మోస్ తో డాల్బి స్క్రీన్ అల్లు సినిమాస్ లో వచ్చే నెలలో ప్రారంభమవబోతుందట.. అలా  దేశంలో మొట్ట మొదటిసారి అల్లు సినిమాస్  డాల్బీ స్క్రీన్ లో అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలా మన దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్లోని అల్లు సినిమాస్ లో మొదటి డాల్బీ మూవీని విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: