ఐబొమ్మ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు.ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలను అష్ట కష్టాలు పెట్టి వేల కోట్ల నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని అరెస్టు చేయడంతో ఎంతో మంది నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఐ బొమ్మ రవి ఆకృత్యాలు బయటపెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో సినీ ప్రముఖులు కూడా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పై నాలుగైదు కేసులు కూడా ఉన్నట్టు సిపి సజ్జనార్ తెలియజేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది నిపుణులు ఐబొమ్మ రవి పై పెట్టిన ఏ కేసు కూడా చెల్లదు అంటూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. 

పైరసీ నేరగాడు ఐబొమ్మ నిర్వాకుడు బప్పం టీవీ నిర్వాకుడు అయినటువంటి ఇమ్మాడి రవి పై ఏ కేసులు నిలబడే అవకాశం లేనట్టు కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన తన వెబ్సైట్ ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి ప్రజలకు ఫ్రీగా సినిమా చూపించారు కానీ ఆ సినిమాలను అప్లోడ్ చేసి చూసే వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు.ఒకవేళ తన వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది తప్పు. అలాంటప్పుడు మాత్రమే కేసు నమోదు అవుతుంది.

ఆయన డబ్బులు డిమాండ్ చేయలేదు కాబట్టి ఆ కేసు నిలవదు అని కొంతమంది అంటున్నారు. అలాగే తన సైట్ లో అప్లోడ్ చేసిన కంటెంట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ చూపించి డబ్బులు సంపాదిస్తే తప్ప ఆయన మీద కేసు నిలవదు అని కొట్టి పారేస్తున్నారు. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి పై పెట్టిన ఏ కేసు కూడా సాలిడ్గా నిలబడే అవకాశం కనిపించడం లేదు అంటూ కొంతమంది నిపుణులు తెలియజేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి వాళ్ళు ఊహించినట్టు ఐబొమ్మ రవి పై పెట్టిన కేసులు చెల్లవా.. త్వరలోనే రవి బయటకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: