కౌబాయ్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ లో ఉండేవి. కానీ కౌబాయ్ సినిమాలను ఇండియాలోకి తీసుకువచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటిసారి కౌబాయ్ సినిమాలను మన ఇండియన్ సినిమాలకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఎంతోమంది హీరోలు కౌబాయ్ రోల్స్ తమ సినిమాల్లో చేశారు.అలా మెగాస్టార్ చిరంజీవి కూడా కొదమసింహం మూవీలో కౌబాయ్ రోల్ పోషించారు. హాలీవుడ్ నటులకు ఏమాత్రం తీసిపోని లెవెల్ లో మెగాస్టార్ ఈ సినిమాలో తన నటనతో ఫ్యాన్స్ ని  ఫిదా చేశారు.అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం మూవీ మరోసారి రీ రిలీజ్  కాబోతోంది.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం.మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం మూవీ నవంబర్ 21న ప్రేక్షకులు ముందుకి మరోసారి రాబోతోంది. 4k రిజల్యూషన్, 5.1 డిజిటల్ సరౌండ్ సౌండ్ వంటి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ముందుకి మరోసారి రాబోతోంది.


ఇక ఈ సినిమా 1990 ఆగస్టు 9న విడుదలైంది. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి భారీ హిట్ తర్వాత కే మురళి మోహన్ రావు డైరెక్షన్లో వచ్చిన కొదమ సింహం మూవీ 4కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమా మాత్రం ఓ మోస్తరు హిట్ అయింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధా హీరోయిన్గా నటించగా.. వాణి విశ్వనాథ్, సోనమ్ లు కూడా  నటించారు. విలన్ గా బాలీవుడ్ నటుడు ప్రాణ్ చోప్రా నటించగా.. మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు,అల్లు రామలింగయ్య, టైగర్ ప్రభాకరన్, బ్రహ్మానందం, సుధాకర్,వై విజయలు కీ రోల్స్ పోషించారు.. ఇక ఈ సినిమా స్టోరీ గురించి చూసుకుంటే.. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రజల నుండి వాళ్ళు ఎలా దోచుకున్నారు అనేది చూపిస్తారు.

ఇందులో భరత్ అనే పాత్రలో చిరంజీవి కనిపించారు.అయితే చిరంజీవి దోపిడీ దారుల నుండి ప్రజలను కాపాడుతుండడంతో ప్రజల్లో దేవుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత విలన్ ప్రాణ్ చోప్రా చేసే వేశ్య పనిని,గ్యాంబ్లింగ్ ని అడ్డుకోవడంతో చిరంజీవి పేరెంట్స్ ని విలన్ చంపేస్తాడు. ఇక పేరెంట్స్ చనిపోయే సమయంలో మేము నీ అసలు తల్లిదండ్రులం కాదని నీ పేరెంట్స్ వేరే వాళ్ళు ఉన్నారని చిరంజీవికి చెప్పడంతో తన నిజమైన తల్లిదండ్రులు ఎవరు అని చిరంజీవి తెలుసుకోవడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన సమయంలో చిరంజీవి తండ్రి ఎవరు.. ఎందుకు కనిపించకుండా పోతాడు..చిరంజీవి తండ్రి దగ్గర ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని ఎవరు కొట్టేశారు..ఆ కోహినూర్ వజ్రం చిరంజీవి దగ్గరికి చేరుతుందా.. చిరంజీవి పేరెంట్స్ ని కలుస్తాడా అనేది స్టోరీ లో చూపించారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు నటన సినిమాకి హైలెట్గా నిలిచింది. అలా భారీ తారాగణంతో తెరకెక్కిన కొదమ సింహం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయి మరోసారి నవంబర్ 21న మన ముందుకు రాబోతోంది. అలా మరొకసారి కౌబాయ్ పాత్రలో నటించిన చిరంజీవిని మనం చూడబోతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: