
దివాళి పండగ సమయంలో ఫన్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా ఇది . కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ చాలా బాగుంది . ఆయన వన్ మ్యాన్ షో చూసాం . మాస్ ఆడియన్స్ కు ఐఫెస్టో అని చెప్పొచ్చు . దర్శకుడు కొత్తవాడైనప్పటికీ సెకండ్ హాఫ్ లు చాలా బాగా ప్రెసెంట్ చేయడం జరిగింది . ఈ మూవీకి డైలాగ్స్ బిగ్గెస్ట్ హిట్ . చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రంకు ప్లస్ పాయింట్ గా ఉంది " అని ఓ ప్రేక్షకుడు కామెంట్ చేశాడు . ఇక ఇంకొక ప్రేక్షకుడు .. " ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ . వేగంగా సాగే స్క్రీన్ ప్లే తో ఫస్టాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది . కాలేజీ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించారు . ఎగ్జామ్ మరియు రెడ్ షీట్ ఎపిసోడ్స్ హైలెట్గా నిలిచాయి . ఇంటర్వెల్ బ్రేక్ అనంతరం ఈ మూవీ మరింత రసవత్తంగా సాగింది . మరీ ముఖ్యంగా హాస్పటల్ సీన్ చాలా బాగుంది .
వెన్నెల కిషోర్ అదే విధంగా నరేష్ కాంబినేషన్లో వచ్చేసి సీన్లు సూపర్ గా ఉన్నాయి . ఎమోషనల్ కాన్సెప్ట్ బాగుంది " అని కామెంట్ చేయడం జరిగింది . ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకుంటున్నారు . చాలామందికి ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పొచ్చు . క్లాసిగా మరియు యాక్షన్ సీన్స్ తో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది . ఏకాక్ ఎక్కడో కొందరికి మాత్రం ఈ మూవీ నచ్చలేదు . అలా నచ్చని పో నెటిజన్ కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది . క్లైమాక్స్ జస్ట్ గుడ్.. ఓవరాల్ గా డిఫరెంట్ అండ్టైనర్ .. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.5 అని ఓ ప్రేక్షకుడి కామెంట్ చేశాడు . ఇలా వారికి తోచిన విధంగా కామెంట్స్ పెడుతూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్లో .