అతిలోక సుందరి ఏడాదిన్నర క్రితం అరబ్ దేశాల్లో బాత్ రూమ్‌లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక ఎవరైనా ఉండొచ్చని అంతా భావించారు. కానీ బాత్రూమ్లో మునగడం వల్లే ఆమె చనిపోయిందని చివరకు తేల్చారు.
ఇప్పుడు సేమ్ టు సేమ్ మన శ్రీదేవిలాగానే మరో నటి కూడా ఇలాగే బాత్ రూమ్‌లో మునిగి చనిపోయింది. ఇది జరిగింది మాత్రం మెక్సికోలో.. అసలు బాత్ రూమ్ టబ్‌లో మునిగి చనిపోతారా అన్న అనుమానాలు ఉన్నా.. ప్రస్తుతానికి అదే నిజమని నమ్మాల్సిన పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే.. మిస్ యూనివర్స్ ఉరుగ్వే ఫాతిమివ్ డేవిలా కూడా మన శ్రీదేవి లాగానే అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరుగ్వే దేశం తరుపున ఈమె మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లోంది. 31 ఏళ్ల ఫాతిమివ్ డేవిలా మెక్సికోలో నివాసం ఉంటోంది.
మోడల్ గానూ రాణిస్తున్న డేవిలా ఓ ఫోటో షూట్ కోసం మెక్సికో వెళ్లింది. అక్కడ ఓ హోటల్లో బస చేసింది. ఆ హోటల్లో బాత్రూమ్లో చనిపోయి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈమె మరణానికి మాత్రం కారణాలు ఇంకా తెలియరాలేదు.