ప్రస్తుత కాలంలో చాలామంది ధనికులు తమ ఆడబిడ్డలను ఎన్ఆర్ఐలకు ఇచ్చి
పెళ్లి చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లో మంచిగా సెటిల్ అయిన యువకులకు తమ కుమార్తెలను ఇచ్చి
పెళ్లి చేసి ఎంచక్కా వారిని కూడా విదేశాలకు పంపించవచ్చనే ఒక ఆలోచన తప్పించి విదేశాల్లో నివసించే భారతీయులు మంచివారా? చెడ్డవారా? వారికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా..? అనే విషయాలను ఏ తల్లిదండ్రులూ తెలుసుకోలేకపోతున్నారు. ఎన్నారైలను
పెళ్లిచేసుకొన్న ఎందరో ఆడవారు వరకట్న వేధింపులకు బాధితులయ్యారు. ఎన్నారైలు తమ భార్యలపై లైంగిక దాడులు చేయడం, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం వంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ కి చెందిన ఇద్దరు మహిళలు కెనడాలో నివసించే ఎన్నారైలను
పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్ది సంవత్సరాల కాలంలోనే వారి భర్తల నిజ స్వరూపం తెలుసుకొని.. ఎన్నారైలను
పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశామని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. వారెవరో తెలుసుకుంటే
గుజరాత్ లో బాగా ఫేమస్ అయిన రచయత్రీ
డాక్టర్ గోరా త్రివేది(42). ఆమె గతంలో ఒక లా కాలేజీకి ప్రిన్సిపాల్ గా కూడా పని చేశారు. ఆమె
జనవరి 2017 లో నీరవ్ అనే ఓ ఎన్నారైను
పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయ్యారు. మరొక గుజరాతి యువతి విధి పటేల్(24) ఎం.ఫార్మసీ పూర్తి చేశారు. 2018, జనవరిలో ఆమె కెనడాకు చెందిన పార్త్ అఘేరాని
పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన తరువాత గోరా, విధి ఇద్దరూ కెనడాలోని కాల్గరీలో స్థిరపడ్డారు. అయితే వీళ్ళిద్దరి భర్తలు తరచూ కలుసుకునేవారు. దీంతో తమ భర్తలు ద్వారా గోరా, విధి ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. ఒక్కోసారి వారిద్దరి భర్తలు చెప్పాపెట్టకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేవారు. చివరికి ఒకరోజు తమ భర్తలు కేవలం స్నేహితులు మాత్రమే కాదని అంతకు మించి వారి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందని.. వారు బై సెక్సువల్ పర్సన్స్ అని తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం తమ భర్తలు తమను లైంగికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లబోదిబోమంటున్నారు.
డాక్టర్ త్రివేదీ తన బాధను ఎవరితో చెప్పుకోనని.. తాను మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకుంటారు అని మీడియాతో వెల్లడించారు. త్రివేది
కెనడా, భారతీయ న్యాయస్థానాల్లో తన భర్తపై కేసు నమోదు చేశారు. తన
భర్త తన
బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.45 లక్షలు దొంగిలించాడని కూడా ఆమె ఆరోపించారు. ఏది ఏమైనా తమ భర్తలు స్వలింగ సంపర్కం చేస్తారన్న వాస్తవం ప్రస్తుతం ఈ గుజరాతి భార్యలకు అసలు మింగుడుపడడం లేదు.