భారత సరిహద్దు వివాదాలను తెరదించేందుకు భారత ప్రభుత్వం ముందడుగు వేసింది. సరిహద్దు వివాదాలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సరిహద్దుల వ్య‌వ‌హారాల‌పై బుధ‌వారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి, మాజీ రక్షణ మంత్రి శరద్ పవార్, ఏకే ఆంటోనీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మేరకు చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది ఈ భేటీలో ఆర్మీ చీఫ్, సీడీఎస్‌ పాల్గొన్నారు. అయితే ఈ మేరకు సరిహద్దు వివాదాలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చైనాతో వివాదంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు సమాచారం.

 అయితే కొద్ది కాలంగా చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదాలపై చర్చ నడుస్తోంది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాల పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ సందర్భంగా బుధవారం చైనా విదేశాంగ మంత్రి తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ స‌మావేశం అయ్యారు. త‌జకిస్తాన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జ‌య‌శంక‌ర్ పాల్గొన్నారు. దాని తర్వాత కేంద్రం కూడా ఇదే విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో భారత్ చైనా విదేశాంగ మంత్రులు భేటీ అయ్యార‌ని పేర్కొంది. ఆ తర్వాత గంటపాటు జరిగిన సమావేశంలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.


 అయితే ఇరు దేశాల సరిహద్దుల వ‌ద్ద‌ తరచుగా వివాదాలు చెలరేగుతూ వ‌స్తున్నాయి. దీని ద్వారా పెద్దసంఖ్యలో సైనికులు మరణిస్తున్న‌ సంగతి తెలిసిందే దీని ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంబడి వివరాలతో పాటు ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల అధికారులు చర్చించినట్టు తెలిసింది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి మాజీ మంత్రులతో భేటీ అవ్వడంతో సమస్యలను మ‌రింత తొంద‌ర‌గా పరిష్కరించే దిశగా ముందడుగు వేసినట్లు భావించవచ్చు.



   గతంలో చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదంలో ఉద్రిక్తత నెలకొన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఇరు దేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ వివాదాలు ఒక కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. ఇదే క్ర‌మంలో భార‌త్ స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా సైనికులను మోహరించడం, యుద్ధ విమానాలను మోహరించడం జరిగింది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది హెచ్చరించింది కూడా. మనకు తెలుసు అదే విధంగా చైనా భారత్ స‌రిహ‌ద్దు వద్ద అలజడులు సృష్టించేందుకు చైనా పలుసార్లు ప్రయత్నించింద ని భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అంతర్జాతీయ చైనా ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ వస్తుంది. దీంతో చైనా భారత్ పై గుర్రుగా ఉంది. ఈ సందర్భంలో రక్షణ శాఖ మంత్రి భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది అని పలువురు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: