శతాబ్దాల నుండి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎప్పటి నుండో ఈ రెండు తమవంటే తమవి అని ఆ దేశాలు ఆధిపత్యం కోసం పోటీపడుతూనే ఉన్నాయి. పాలస్తీనా నాదంటుంది ఇజ్రాయెల్; అలాగే ఇజ్రాయెల్ నాది అంటుంది పాలస్తీనా. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ అభిప్రాయాలలో మాత్రం మార్పులు చోటుచేసుకోలేదు. ఇంతలా జరుగుతున్నప్పటికీ, ఒక దేశంలో కి మరో మరొకరు వెళ్తూనే ఉంటారు. రాకపోకలు ప్రజలు చేస్తూనే ఉంటారు, ఆయా వర్గాల మధ్య స్నేహాలు, బాంధవ్యాలు కూడా ఉంటాయి. కానీ ఆధిపత్యం కోసం ప్రభుత్వాలు మాత్రం పోరాటాలు చేస్తూనే ఉంటాయి. అదేమీ విచిత్రమో మరి.

ఈ ఇరు దేశాల మధ్య ఉన్న గాజా లో ఎప్పుడు గొడవలు తప్పవు. ఇరు వర్గాలు కూడా ఒకే మతమభిమానులు కావడం, ఆయా మందిరాలు కూడా ఒకటే కావడంతో ఈ గొడవలు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఒక అడుగు ముందుకు వేసి, గాజా చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. భూగర్భంలో నుండి కూడా ఎవరు సరిహద్దు దాటకుండా సెన్సార్ లు ఏర్పాటు చేసింది. దీనితో ఉన్న బేదాభిప్రాయాలు మాసిపోతాయో లేక కొత్తవి పుట్టుకొస్తాయో అనేది చూడాల్సి ఉంది. ఇజ్రాయెల్ ఈ పని చేయడం వెనుక కేవలం కరోనా  కారణమా మరొకటి ఏదైనా ఉన్నదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న.

ఈ చర్యకు ప్రతి చర్య పాలస్తీనా ఇక ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. గాజా లో పరిస్థితి విషమించే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు నిపుణులు. ఒకవేళ పాలస్తీనా దీనిపై మరోసారి ఇజ్రాయెల్ తో గొడవలకు సిద్ధం అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ గోడవల మధ్య అటుఇటు మిత్రులుగా బంధువులుగా మారిన వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పాలస్తీనీయులు అసలు ఇజ్రాయెల్ వైపు వెళ్లకుండా ఉంటె ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండేవి కావని, తప్పంతా పాలస్తీనా వాసులదే అనేది కనిపిస్తున్న కారణం. ఇంకోటి ఏమైనా ఉంటె అది ఇరు దేశాలకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: