భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఎప్పుడూ హాట్ హాట్ గానే మారిపోతున్నాయి అని చెప్పాలి . ఎందుకంటే సరిహద్దుల్లో నిషేధిత భూభాగాలలో సైతం నిర్మాణాలు చేపడుతూ ఇక రెచ్చగొట్టడు చర్యలకు పాల్పడుతుంది చైనా. ఈ క్రమంలోనే దాదాపు కొన్ని నెలల నుంచి కూడా భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు యుద్ధ వాతావరణన్ని తలపిస్తూ ఉన్నాయి. కొన్ని రోజులపాటు ఇక పరిస్థితులు సద్దుమణిగినట్లు కనిపించిన మళ్లీ చైనా సైన్యం ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడం కారణంగా ఇక సరిహద్దుల్లో గడ్డకట్టుకుపోయే చలిలో కూడా పరిస్థితులు హాట్ హాట్ గానే ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలంలో ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నా.. భారత ఆర్మీ అటు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నిర్విరామంగా సరిహద్దుల్లో పహారా కాస్తూ చైనా సైనికులకు ఎప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. అదే సమయంలో ఇక సరిహద్దుల్లో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. అయితే తూర్పు లడక్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడంలో చైనా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తుంది.


 ఈ క్రమంలోని రహదారుల నిర్మాణం తో పాటు ఎన్నో మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకుంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ విషయాన్ని పసిగట్టిన భారత ప్రభుత్వం ఒక సరికొత్త ఎత్తుగడకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఏకంగా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో కొత్త వైమానిక కేంద్రాన్ని నెలకొల్పాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే న్యూ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణ పనులను చేపట్టేందుకు సనాహాలను ముమ్మరం చేసింది భారత్.  ఒకవేళ ఈ నిర్మాణం పూర్తయింది అంటే చాలు చైనా సరిహద్దు నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో భారత్ కి కొత్త ఎయిర్ ఫీల్డ్ అందుబాటులోకి రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: