రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వేలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటిఅప్పుడు తెలివిగా ఉంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ రాజకీయంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండడం కుదరని పని.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ లోనే ఉన్నాడు.. వైఎస్ జగన్ దెబ్బకు కుదేలైపోయి అసలు రాజకీయాలలో ఉంటాడా లేడా అన్నట్లు అయన పరిస్థితి తయారైంది.