ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీ లు కురిపించే హామీలకు అడ్డు అదుపు ఉండదు ఎందుకంటే నోటికి ఎదోస్తే అది ఇస్తామని చెప్తూ ప్రజలను మభ్యపెడుతుంటారు.. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో అదే జరుగుతుందని చెప్పొచ్చు.. ఈ ఎన్నికల్లో పాల్గొన్న టీ ఆర్ ఎస్ , కాంగ్రెస్, బీజేపీ పార్టీల హామీలకు ఆకాశమే హద్దు గా నిలుస్తుంది.. ఇంకో పార్టీ టీడీపీ ఎలాంటి హామీలు ఇవ్వకుండా ప్రచారంలో మాత్రం దూసుకుపోతుంది. అయితే ఇటీవలే తెలంగాణ లోని ముఖ్య పార్టీ లు విడుదల చేసిన మేనిఫెస్టో ని చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని పార్టీ లు గెలుపు గుర్రం ఎక్కాలని ప్రజలకు లేని హామీలను కురిపిస్తుంది.