తెలంగాణ లో కేసీఆర్ పరిస్థితి, పార్టీ పరిస్థితి కొంత అయోమయంగా ఉంది. గతంలో ఎప్పుడు లేని వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది. ప్రజల తిరుగుబాటు తో వారికి ఇప్పుడు ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది..నమ్మకం కోల్పోతున్నామన్న భయం అయితే వారిలో ఉంది. ఏకపక్షంగా గెలిచి అధికారంలోకి రావడం కేసీఆర్ స్పెషల్.. కానీ ఇప్పుడు గ్రేటర్ లో హాంగ్ ఏర్పడింది.. ఏ పార్టీ కి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ఈ హాంగ్ ఏర్పడగా టీ ఆర్ ఎస్ మేయర్ పీఠం ఎక్కడానికి ఎంఐఎం ఖచ్చితంగా సహాయపడాల్సిన పరిస్థితి వచ్చింది. టీ ఆర్ ఎస్ 55 సీట్లు రాగ,బీజేపీ కి 49 , ఎంఐఎం కి 44 , కాంగ్రెస్ కు రెండు స్థానాలు వచ్చాయి..