గత కొన్ని రోజులుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల బిడ్డ, జగన్ చిన్నారి చెల్లి వైఎస్ షర్మిల ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఓ ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ వర్గాలనుంచి కానీ, వైఎస్ సన్నిహితుల దగ్గరినుంచి కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోగా త్వరలోనే పార్టీ నెలకొల్పుతున్నారంటూ వార్తలు అంతకంతకు ఎక్కువయిపోతున్నాయి. తాను కొత్త పార్టీ పెట్టట్లేదను అని షర్మిల తేల్చి చెప్పినా కూడా ఈ ప్రచారం తగ్గట్లేదు. దీన్ని టీడీపీ రాజకీయాంశంగా మార్చడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ దీనిపై ఎలాంటి ఎదురుదాడి చేయకుండా కళ్లప్పగించు చూస్తుంది.