తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి ఆదర్శకంగా నిలిచి..ఎంతో మంది జీవితాలు బాట చూపించిన గొప్ప దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణ రావు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న కీమ్స్ ఆసుపత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఎంతో మంది ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. ఇక తెలుగు ఇండస్ట్రీ మొత్త దాసరి నారాయణరావు ఇంటి వద్దే ఉంది. ఇదిలా ఉంటే..అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆయన పెద్ద కోడలు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాసరి పెద్ద కోడలు సుశీల.. ఆయన చనిపోయిన కొన్ని గంటలకే మీడియా ముందుకొచ్చి ఆస్తి గొడవలపై మాట్లాడారు. దాసరి తనకు అన్యాయం చేసి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి మరణంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. దాసరి పెద్ద కొడుకు తారక ప్రభు భార్య సుశీల...వీరి విడిపోయినా విడాకులు మాత్రం తీసుకోలేదని అన్నారు.
తారకప్రభుతో సుశీలకు ఎప్పట్నుంచో విభేదాలున్నాయి. గతంలో అతడిపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది సుశీల. మే 4న తాను దాసరిని కలిసినట్లు..తన కొడుకు మాస్టర్ దాసరినారాయణ రావుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని వాగ్ధానం చేసినట్లు చెప్పారు. అంతే కాదు ఇప్పటి వరకు ఆస్తి పంపకాల్లో కూడా తనకు ఏమీ రాలేదని వాపోయారు.
ఎంతో మంది జీవితాలకు దారి చూపించానని మీ జీవితాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె అన్నారు. ఇలా చెప్పిన ఆయన ఇంతలోనే వెళ్లిపోయారని.. రెండు రోజుల కిందట దాసరిని కలుద్దామని ఆసుపత్రికి వస్తే తనను లోపలికి వెళ్లనివ్వలేదని.. అందుకే ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ఆరోపించింది.