ధోనీ.. ఈ పేరు విన‌గానే.. కోట్లాది క్రికెట్ హృద‌యాలు ఉప్పొంగిపోతాయి. మైదానంలో మిస్ట‌ర్ కూల్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. బ్యాట్ ప‌ట్టాడంటే.. దంచుడే దంచుడు.. ధనాధ‌న్‌.. ధోనీ.. ఇలా ఎన్నోపేర్లు.. మ‌రెన్నో రికార్డులు ఆయ‌న సొంతం. కానీ.. మైదానంలో బాల్‌ను దంచ‌డంలోనే కాదు.. బ‌య‌ట అందిన‌కాడికి దండుకోవ‌డంలోనూ ధోనీది ప్ర‌త్యేక‌మైన శైలేన‌ని ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇదేమిటి.. ధోనీ.. దండుకోవ‌డం ఏమిట‌ని నోర‌ళ్ల‌బెట్టాల్సిన అవ‌స‌రం లేదు.. ఆయ‌న‌గారి చీక‌టి బాగోతం.. అంతా కూడా దేశ స‌ర్వోన్న‌త న్యాయస్థానం సాక్షిగా బ‌య‌ట‌ప‌డుతోంది. 


ఆమ్ర‌పాలి.. ఈ పేరుగానే.. ఇళ్లుక‌ట్టిస్తామ‌నే పేరుతో జ‌నం నుంచి వేల‌కోట్లు వ‌సూలు చేసిన విష‌యం గుర్తుకువ‌స్తుంది. జ‌నం డ‌బ్బులు వ‌సూలు చేసి.. ఆ డ‌బ్బును అనేక ఫేక్ కంపెనీల‌కు మ‌ళ్లించిన ఘ‌న‌త కూడా ఈ కంపెనీదే. అంటే.. ఆమ్ర‌పాలి కంపెనీయే.. అనేక ఫేక్ కంపెనీల‌ను సృష్టించింది. అందులో ఒక‌టి ఆమ్ర‌పాలి మ‌హి డెవ‌ల‌ప‌ర్స్ కంపెనీ. ఇందులో ధోని భార్య పేరిటి 25శాతం వాటా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక మిగ‌తా 75శాతం వాటా కంపెనీ సీఎండీ అనీల్‌కుమార్ శ‌ర్మ పేరిట ఉంది. అంటే.. ఇక్క‌డ కంపెనీతో ధోనికి సంబంధాలు ఉన్నాయ‌న్న‌మాట‌. మ‌హి డెవ‌ల‌ర్స్ కంపెనీకి ఆమ్ర‌పాలి కంపెనీ నుంచే డ‌బ్బులు మ‌ళ్లించారు. 


ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆమ్ర‌పాలి గ్రూపుకు ధోని చాలా ఏళ్ల‌పాటు అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. అయితే.. ఎప్పుడైతే.. ఈ బాగోతం బ‌య‌ట‌కువ‌స్తుండ‌డం మొద‌లైందో.. అంటే మూడేళ్ల కింద‌ట‌.. అప్పుడు త‌ప్పుకున్నాడు. ఇక త‌ర్వాత‌.. ఆ కంపెనీ త‌న సేవ‌ల్ని ఉప‌యోగించుకుని డ‌బ్బుల ఇవ్వ‌డం లేదని, సుమారు రూ.40కోట్లు రావాలంటూ.. ధోని కోర్టుకు కూడా వెళ్లాడు. అలాగే.. ఆమ్ర‌పాళి గ్రూపుకు, రితి స్పోర్ట్స్ మెనేజ్‌మెంట్ కు కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే.. ఈ రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ధోనీదే ప్ర‌ధాన వాటా కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంస్థ ప‌లువురు క్రికెట‌ర్ల‌కు సంబంధించిన యాడ్స్ త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌ను చూస్తుంది. 


ఇలా ఆమ్ర‌పాలి, మ‌హి డెవ‌ల‌ప‌ర్స్‌, రితి, చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ల మ‌ధ్య ఆర్థిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు ప‌రిధిలో ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కే ఓ బృందం ఆమ్ర‌పాలి గ్రూపుపై ద‌ర్యాప్తు చేప‌ట్టి నివేదిక అందించింది. పై అంశాల‌న్నీ కూడా ఆ నివేదిక‌లో పొందుప‌రిచిన‌వేకావ‌డం గ‌మ‌నార్హం. కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న ధోని చీక‌టి బాగోతం బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో మ‌రి. ఇప్ప‌టికే ఆయ‌న ఆట‌తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్న‌వేళ‌.. ఆమ్ర‌పాలి గ్రూప్ వ్య‌వ‌హారం ఆయ‌న‌కు మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: