చంద్రబాబునాయుడుకు ఏమో అయ్యిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  సంక్రాంతి పండుగ పూట రాజధాని అమరావతి  గ్రామాల్లోని   రైతుల ఆందోళనలపై చంద్రబాబు చేసిన ట్వీట్ చూస్తుంటే అందరికీ ఇదే అనుమానంగా ఉంది. సంక్రాంతి రోజున కళకళలాడాల్సిన రైతుల లోగిళ్ళు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నాయట. దాని ఫలితంగా రైతు కుటుంబాలు పస్తులుంటున్నాయని తెగ బాధిపడిపోతున్నారు.

 

అన్నపూర్ణగా పేరుపొందిన ఏపిలో రైతులను  పండగపూట పస్తులుంచిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారంటూ ట్వీట్ చేయటమే విచిత్రంగా ఉంది.  పండుగ సంక్రాంతిని పస్తుల సంక్రాంతిగా చేసిన పాపం జగన్ దే అంటూ చాలా ఫీలయిపోయారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు సంక్రాంతి పడుగను చేసుకోవద్దని రాష్ట్రప్రజానీకానికి పిలుపిచ్చిందే  చంద్రబాబు.  రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలనే డిమాండ్ తో గడచిన 30 రోజులుగా ఆందోళనలు చేయిస్తున్నదే చంద్రబాబు. రాజధాని ప్రాంతంలోని అన్నీ గ్రామాల రైతులు తన పిలుపుకు స్పందికచపోవటం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తిరుగుతూ జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

రాజధాని రైతులు తమ పంటలకు  గిట్టుబాటు ధరలు లేక పస్తులు లేరు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అసలు పంటలే లేకుండా  చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.  రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని చాలామంది  రైతులను వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వైపు మళ్ళించేసిందే చంద్రబాబు. స్వంత ప్రయోజనాల కోసం వాళ్ళను రెచ్చగొట్టి  పండుగ చేసుకోవద్దని చెప్పి ఇపుడు పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటంతోనే వాళ్ళంతా పండుగ చేసుకోవటం లేదని పస్తులుంటున్నారని దొంగేడుపులేడుస్తున్నారు.

 

మొత్తానికి చంద్రబాబులోని  అపరిచితుడు బాగానే పనిచేస్తున్నట్లున్నాడు. లేకపోతే నోటికొచ్చినట్లు అబద్ధాలాడటం, రైతులను రెచ్చగొట్టటానికి జగన్ ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. రాష్ట్రమంతా సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకుంటున్నారంటే చంద్రబాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదనే కదా అర్ధం.  చంద్రబాబును నమ్ముకుంటే చివరకు రాజధాని ప్రాంతంలోని రైతుల నోట మట్టే అని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: