ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూసి  ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 వడ్రంగి రామారావు జననం : తెలుగు సినీ రచయిత కవి రాష్ట్ర పురస్కార గ్రహీత అయిన వాడ్రంగి  రామారావు   1936 జనవరి 26వ తేదీన జన్మించారు. ఈయన ప్రముఖ వ్యాఖ్యాత రూపకర్తగా కూడా పనిచేశారు. 

 

 శివ లాల్ యాదవ్ జననం  : భారత జట్టు మాజీ క్రీడాకారుడు శివలాల్ యాదవ్. 1987 జనవరి 26వ తేదీన హైదరాబాద్ లో జన్మించిన శివలాల్ యాదవ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం కూడా వహించాడు. భారత జట్టు తరఫున 1977 నుంచి 1987 మధ్యకాలంలో 120 టేస్ట్ లు  ఏడు వన్డేలకు  ప్రాతినిథ్యం వహించాడు. 

 

 

 రవితేజ జననం : రవితేజ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులందరికీ రవితేజ మాస్ మహారాజా కొసమెరుపు. రవితేజ 1968 జనవరి 26వ తేదీన జన్మించారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రవితేజ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రేక్షకులందరికీ మాస్ మహారాజ గా మారిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ రవితేజ డైలాగ్ డెలివరీ కామెడీ స్టైల్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తు ప్రేక్షకులను  ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం రవితేజ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

 

 

 నవదీప్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయిన నవదీప్ ఎన్నో సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో  విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులందరూ అలరిస్తున్నారు నటుడు నవదీప్. తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాలలో కూడా నటించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురమూలో సినిమాలో  కూడా ఓ ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కాగా  నవదీప్ 1985 జనవరి 26వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: