ఎనిమిదేళ్ళ క్రితం డిసెంబర్ 17, 2012 రాత్రి సినిమాకు వెళ్లి వస్తున్న నిర్భయను అతి దారుణంగా కదులుతున్న బస్సుల్లోనే రేప్ చేసిన నిందితులను చట్టప్రకారంగా పట్టుకొని ఉరిశిక్ష విధించారు.  ఉరి నుంచి తప్పించుకోవడానికి దోషులు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు.  మృత్యువు తరుముకొస్తున్నప్పుడు దాని నుంచి తప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉపయోగం ఉండదు.  ఆ విషయం అందరికి తెలుసు.  ఇన్నాళ్లు తప్పు చేశామనే భయం వాళ్లలో కలగలేదు.  కానీ, మరో వారం రోజుల్లోనే చనిపోబోతున్నాము అని తెలిసిన తరువాత వారికి మృత్యుభయం పట్టుకుంది.  


ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ శిక్ష అనంతరం ఒకరిని వదిలేశారు.  మరొకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.  కాగా, మిగిలిన నలుగురు దోషులకు ఉరి ఖాయమైన సంగతి తెలిసిందే.  ఈనెల 22 న ఉరి తీయాల్సి ఉన్నా, కొన్ని టెక్నికల్ కారణాల వలన ఆలస్యం అయ్యింది.  ఉరి నుంచి తప్పించుకునేందుకు చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్ష అని చెప్పి అర్జీ పెట్టుకోగా దాన్ని కూడా రాష్ట్రపతి తిరస్కరించారు.  ఈ తిరస్కరణ తరువాత రెండు వారల గ్యాప్ ఉండాలి.  


కానీ, ఈ గ్యాప్ ను వారానికి తగ్గించేశారు.  చివరగా వాళ్లకు ఫిబ్రవరి 1 వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు డెత్ వారెంట్ రిలీజ్ చేసింది.  దీనికి సంబంధించి అన్ని చర్యలను తీహార్ జైలు తీసుకున్నది.  నలుగురు నిందితులను నాలుగు సెల్ లలో ఉంచారు.  భోజనం పెడుతున్నారు.  కానీ, తప్పు చేసి జైలుకు వచ్చామనే విషయం కొన్ని నెలల క్రితం వరకు పెద్దగా లేకపోయినా, మరో వారంతో చనిపోబోతున్నాము అని తెలిసిన తరువాత వారిలో తెలియని భయం ఆవహించింది.  


ఈ భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు.  భోజనం తినడం లేదట.  సరిగా నిద్రపోవడం లేదట.  దీంతో చిక్కి శల్యమై పోతున్నారు. ఎలాగైనా ఉరి నుంచి తప్పుకించుకోవాలని తాపత్రయ పడుతున్నారు.  ఆరోగ్యం చెక్ చేసిన తరువాతే వాళ్లకు ఉరి వేస్తారు.  ఆఖరు యత్నంగా ఇలా చేస్తున్నారు. చావు భయం ఎలా ఉంటుందో ఆ నలుగురు దోషులు క్షణ క్షణం అనుభవిస్తున్నారు.  నిర్భయ పడిన వేదన ఎలాంటిదో వాళ్లకు ఇప్పుడు తెలుస్తున్నది. ఈ నలుగురి ఉరి తరువాతైనా మిగతా వాళ్లకు బుద్ధివస్తే అంతే చాలు.  ఈ ఘోరాలు అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: