తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలం లేకపోయినా, విశాఖలో మాత్రం ఆ పార్టీ కాస్త బలంగానే ఉంది అనే సంకేతాలు మొన్నటి ఎన్నికల ఫలితాలు తర్వాత అందరికీ అర్థమైంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలను టిడిపి గెలుచుకోగలిగింది. ప్రస్తుతం వారంతా టిడిపిలోనే ఉన్నారు. అంతేకాకుండా వారంతా రాజకీయంగా  ఎటువంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మలుచుకునే సత్తా ఉన్నవారు. వారిలో ప్రధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖ నగరంలో ఆయనకు గట్టి పట్టు ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా విజయం ఆయన సొంతమే. అంతగా అక్కడ పేరు సంపాదించుకున్నారు. అటువంటి విశాఖ కార్పొరేషన్ లో  మేయర్ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠగా మారింది. గతేడాది ఇక్కడ నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఆ నాయకులు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.

 

IHG


ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రకంగా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ దశలో విశాఖ మేయర్ స్థానం తెలుగుదేశం ఖాతాలోనే పడుతుందని అంతా అంచనా వేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత టిడిపి అర్బన్, రూరల్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వార్డుల్లో కార్యకర్తల అభిప్రాయాల మేరకు కార్పొరేషన్ ఎంపిక ఉంటుందని సమావేశం నిర్ణయం తీసుకుంది. దీనికి నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు ఇంచార్జీలు సమిష్టి కృషితో నిర్ణయం తీసుకుని అభ్యర్థిని గెలిపించాలని తీర్మానాలు కూడా చేసుకున్నారు. 

IHG


అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరికి గుర్రుగా ఉంటూనే వస్తుండడంతో ఇక్కడ పార్టీని  గెలిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ప్రశ్నగా మారింది. అంతేకాకుండా ప్రస్తుతం నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఏపీ అధికార పార్టీ వైసీపీ తో సన్నిహితంగా మెలుగుతున్నారు అనే అనుమానాలు కూడా టీడీపీ అధిష్టానం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ ఎన్నికలను ముందుకు నడిపించే నాయకులు ఎవరా అనే సందిగ్ధంలో టిడిపి ఉంది. పైకి టిడిపి అభ్యర్థులను గెలిపిస్తామని నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. టిడిపి అధిష్ఠానం మాత్రం ఇంకా వారి పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో అయినా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని వైసిపి భావిస్తోంది.

IHG


 ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టిడిపికి ధీటుగా ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీలో బలమైన నాయకులు అందరినీ వైసీపీలో చేర్చే విధంగా వ్యూహాలు రచించారు. ఈ మేరకు విశాఖ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నరెహమాన్  వైసీపీ కండువా కప్పుకున్నారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ కూడా వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరే కాకుండా నియోజకవర్గస్థాయి నాయకులు చాలామంది వైసీపీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో టిడిపి ఆందోళన చెందుతోంది. తమకు ఇక్కడ బలం ఉన్నా, దానిని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోతున్నామనే బాధ ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.

 

   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: