ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా పేరు వింటే చాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలోని అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, థియేటర్లతో పాటు మాల్స్ బంద్ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మాత్రమే స్కూళ్లు, థియేటర్లు ఓపెన్ చేసేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు తిరగవద్దని ఆదేశాలు జారీ చేశాయి. 
 
కరోనా వల్ల అన్ని రంగాలకు నష్టం వాటిల్లుతున్నా గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలకు మాత్రం భారీగా లాభం చేకూరుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వడంతో ఈ కంపెనీలకు కాసుల వర్షం కురుస్తోంది. ఉద్యోగులు కరోనాకు భయపడి ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. 
 
ఆన్ లైన్ లో ఆర్డర్ల పెరుగుదల గురించి బిగ్ బాస్కెట్ సీఈవో హరి మీనన్ స్పందించారు. గతంతో పోలిస్తే భారీగా వినియోగదారులు పెరిగారని తాము సిబ్బందిని, డెలివరీ వ్యాన్స్ ను పెంచుకోనున్నామని తెలిపారు. గ్రోఫర్స్ ఫౌండర్ అల్బిందన్ దిండ్సా మాట్లాడుతూ అమ్మకాలు వారం ప్రారంభంలో 5 నుండి 7 శాతం పెరిగాయని వీకెండ్స్ లో 80 శాతం పెరిగాయని చెప్పారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి 5,833 మంది మరణించారు. 1,56,000 మంది కరోనా బాధితులుగా ఉన్నారు. మన దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం నిన్నటికి 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు వీలుగా అమెరికా కొత్తగా వ్యాక్సిన్ ను కనుగొంది. క్లినికల్ పరీక్షలు పూర్తి చేసి ఈ వ్యాక్సిన్ ను పూర్తిగా ధ్రువీకరించడానికి 12 నుండి 18 నెలల సమయం పడుతుందని అమెరికా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: