గుంటూరు జిల్లా కర్లపాలెం మార్కెట్ లో వీఆర్వో అధికారి, కానిస్టేబుల్ ల మధ్య భీకరమైన గొడవ జరిగగా... అక్కడి స్థానిక ప్రజలనంతా వాళ్లని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా కూడా వాళ్ళిద్దరూ తమ చొక్కా గళ్లాలను పట్టుకొని కొట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే... పెదపులిగురివానిపాలెం వీఆర్వో శివారెడ్డి ఆదివారం రోజు కర్లపాలెం కేంద్రంలోని ఒక మెడికల్ షాప్ మందులు కొనేందుకు బైక్ పై వచ్చాడు. మందులు కొనుగోలు చేసే క్రమంలో తన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్ ఎదుట పార్క్ చేసాడు.


అయితే ఆ సమయంలోనే మార్కెట్ ముందు నుంచి వెళ్తున్న సురేష్ అనే ఓ కానిస్టేబుల్ శివారెడ్డి బైక్ ని చూసి పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఇలా నడి రోడ్డు పై బైక్ పార్క్ చేశారు ఎవరు అని గట్టిగా అరిచాడు. దాంతో శివారెడ్డి మందుల షాపు నుండి కానిస్టేబుల్ వద్దకు వచ్చి... బైక్ మీద వీఆర్వో అని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని రాసి ఉంది కదా కనబడడం లేదా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ ఏదో మాట అనేసరికి వారిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత వారి వాగ్వాదం కాస్త కొట్లాటకు దారితీసింది. ఈ సమయంలోనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.


ఇదంతా చూస్తున్న స్థానిక ప్రజలు, మరొక పోలీస్ అధికారి సాంబశివరావు వీరిని ఆపేందుకు యత్నించారు కానీ వీళ్ళు మాత్రం తాము ఉన్నతమైన ఉద్యోగులమని మర్చిపోయి నడిరోడ్డుపై వీధి రౌడీల్లా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టుకుంటూ కొట్లాడుకున్నారు. దెబ్బలు కొట్టుకున్న తర్వాత వాళ్ళ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా నడిరోడ్డుపై ఇద్దరు ప్రభుత్వ అధికారులు విచక్షణ రహితంగా కొట్టుకోవడం ప్రస్తుతం అందరినీ విస్మయానికి కారణం అవుతుంది. వీళ్లిద్దరి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల డిఎస్పి ఎమ్మార్వో కలిసి వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: