మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్టు... ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అనుకోని విధంగా కొన్ని సార్లు మృత్యువు దరిచేరుతు  ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ విషాద ఘటన జరిగింది. ఓకే  కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే సారి ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా విషాదం నిండిపోయింది. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తాజాగా ఒకరిని కాపాడబోయి మరొకరు అతని కాపాడబోయి ఇంకొకరు... అతని కాపాడబోయి మరొకరు ముగ్గురు చెరువులో మునిగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 

 


 విషాదకరమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గం పాడు మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు నల్లమోతు అప్పారావు కూరగాయల సాగు చేస్తూ  ఉండేవాడు. అయితే కూరగాయల పంటకి పురుగు మందు కొట్టేందుకు ఉదయం తండ్రి  కృష్ణయ్య... కుమారుడు తేజస్  మేనల్లుడు జాగర్లమూడి వినయ్ కుమార్ కలిసి పొలానికి  వెళ్ళారు. అందరూ కలిసి తోట లో పురుగుల మందు కొట్టారు. ఇక పురుగుల మందు కొట్టడం పూర్తయిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేందుకు స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే వినయ్ కుమార్ చెరువులోకి   ప్రమాదవశాత్తు జారిపడి  మునిగి పోయాడు. 

 


 ఇది గమనించిన తేజస్ వినయ్ ని  బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అతను కూడా ప్రమాదవశాత్తు జారిపోయి చెరువులో మునిగి పోయాడు. దీంతో సాయం కావాలని కాపాడాలని ఇద్దరు అరుస్తున్న సమయంలో వీరిద్దరిని కాపాడేందుకు యత్నించిన అప్పారావు కూడా నీటిలో మునిగిపోయాడు.. అదే సమయంలో వీరిని కాపాడే ప్రయత్నంలో కృష్ణయ్య అనే వ్యక్తి వెళ్ళి మునిగిపోతుండగా  స్థానికులు గమనించి వెంటనే పరుగున వచ్చి అతన్ని బయటకు లాగారు. అయితే ఆ ముగ్గురికి ఈత  రాకపోవడం చెరువులో లోతైన గుంతలు ఉండడమే ఈ విషాద ఘటన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: