రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. అలా మార్చుకోకపోతే ఎప్పటికీ అగ్ర స్థానానికి పార్టీని తీసుకు వెళ్ళలేరు. ఇప్పుడు అదే విషయాన్ని చాలా ఆలస్యంగా బిజెపి అధిష్టానం గుర్తించినట్లు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని, అధికారం చేపట్టాలని చూస్తున్న బిజెపి చాలా కాలంగా ఆ విధంగా ప్రయత్నం చేస్తోంది. అయినా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న ఆ సమయంలో ఆ పార్టీ తరఫున బీజేపీ నేతలు మాట్లాడేవారు. అలాగే పొత్తు రద్దయిన తర్వాత కూడా అదే విధంగా బిజెపి నేతలు టిడిపిని సమర్థిస్తూ వచ్చారు. ముఖ్యంగా అప్పటి బిజెపి ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పూర్తిగా చంద్రబాబు మనిషిగా ముద్ర వేయించుకోవడంపై అధిష్టానం స్పందించి వెంటనే ఆయనను తొలగించి ఆయన స్థానంలో కన్నా లక్ష్మీ నారాయణను తీసుకువచ్చారు. 

 

IHG

 

ఇప్పటికే బిజెపిలో మూడు గ్రూపులు ఉండడం, ఏ విషయంపైనా వారు ఒకే అభిప్రాయం వ్యక్తం చేయకుండా, రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో అసలు ఏమి జరుగుతోంది అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉండేది. దీంతో బీజేపీలో కూడా గందరగోళం తలెత్తింది. ఇక ఎప్పుడూ ఇలాగే ఉంటే తాము ఏపీలో అధికారం చేపట్టడం అసంభవమని గుర్తించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని, వారిపై వేటు వేసేందుకు వెనకాడబోమనే సంకేతాలను పంపించి అప్రమత్తం చేసేందుకు సిద్ధమైంది. 

IHG


2024లో అధికారంలోకి రావాలంటే, ఇప్పటి నుంచే పార్టీ నాయకులను దారిలో పెట్టాలని  బిజెపి డిసైడ్ అయింది. దీనిలో భాగంగానే కొద్ది రోజులుగా బిజెపి దూకుడుగా వ్యవహరిస్తోంది. బిజెపిలో గ్రూపుల అనేది ఉండకూడదని నేతలంతా ఒకే అభిప్రాయంతో ఉండాలని అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అనే సంకేతాలు ఇస్తోంది. రాష్ట్ర నాయకులు నిర్ణయం, అధిష్టానం నిర్ణయం ఒకేలా ఉండాలని, మిగతా అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని, తమతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ తో కలిసి ముందుకు వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర బిజెపి నాయకులకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంపైన బిజెపి అధిష్టానం సీరియస్ గానే స్పందించింది. 

 

IHG


ఆయనకు మద్దతుగా మాట్లాడిన బిజెపి నాయకులు దిలీప్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. అవినీతిపరులను ఏ విధంగా సమర్ధిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. అలాగే మరో బిజెపి నాయకుడు లక్ష్మీపతి రాజా ను ఏకంగా సస్పెండ్ చేసింది. ఇకపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి ఉంటుందనే సంకేతాలను బీజేపీ అధిష్టానం ఇవ్వడంతో ఏపీ బీజేపీ నాయకులు మరింత అప్రమత్తమైనట్లుగా కనిపిస్తున్నారు. అధిష్టానం దూకుడు చర్యలతో ఏపీ బిజెపిలో గ్రూపులు అనేవి కనిపించకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: